శ్రీ కృష్ణ పాండవీయం ఈ చిత్రంతో ఎన్.టి. రామారావు పేరు దర్శకునిగా మొదిటి సారి వెండితెర మీద కనిపించింది. గతంలో సీతారామ కల్యాణం, గులేబకావలి కథ సినిమాలకు దర్శకత్వం వహించినా, దర్శకుని పేరు క్రెడిట్స్ లో వేయలేదు. ఎన్.టి.రామారావు శ్రీకృష్ణ, దుర్యోధన పాత్రలను అపూర్వంగా పోషించారు. కాదు ఆ పాత్రలలో ఇమిడి పోయారు. కె.ఆర్.విజయ రుక్మిణి పాత్రలో ముగ్ధమనోహరంగా ఉంటుంది. గతంలో సి.ఎస్.ఆర్., లింగమూర్తి శకుని పాత్రను పోషించారు. వారి పాత్రధారణకు భిన్నంగా ధూళిపాల ఈ చిత్రంలో శకుని పాత్రను పోషించారు. శకుని పాత్ర ధారణకు ధూళిపాల కొత్త ఒరవడిని సృష్టించారు. జరాసంధునిగా ముక్కామల, శిశుపాలునిగా రాజనాల, రుక్మిగా కైకాల సత్యనారాయణ పాత్రలలో జీవించారు. మిగిలిన నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు. భారత కథలో భాగవత కథ రుక్మిణీ కల్యాణాన్ని జోడించారు. ఐతే అది అతికినట్టు కాకుండా సహజంగా ఇమిడి పోయింది. కంటిన్యూటి ఎక్కడా చెడలేదు. మయసభ సెట్టింగ్ చాలా భాగుంటుంది. భారీ సెట్టింగ్.ఆ సెట్టింగ్ గురించి ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునే వారట. ఆ సెట్ విజయ వాహిని స్టూడియోలో వేసేరట. ఆ ఫ్లోర్ లో ఎవ్వరినీ అనుమతించే...