విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం ‘ షాడో’ టీజర్ విడుదలైంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో వెంకీ డాన్ పాత్రపోషిస్తున్నారు. కంత్రి, బిల్లా, శక్తి చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రధారులుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈచిత్రంలో మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ, శ్రీకాంత్ సరసన మధురిమ నటిస్తోంది. నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. http://youtu.be/F4GznCvAGoc
తెలుగు సినిమా లిరిక్స్ అండ్ సాంగ్స్