మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ ఎప్పుడు వర్కవుట్ అవుతుందా అని వేచి చూసే మెగాఫ్యాన్స్ కల సాగారం కాబోతోంది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ ఎప్పుడు వర్కవుట్
అవుతుందా అని వేచి చూసే మెగాఫ్యాన్స్ కల సాగారం కాబోతోంది. దీనికి
సంబంధించిన స్టోరీ చరణ్ కి మూడు నెలల క్రితమే త్రివిక్రమ్ వినిపించాడని
తెలుస్తోంది. ఆ కథ నచ్చడమే కాకుండా ... త్రివిక్రమ్ టేకింగ్ స్టైల్ పై ఉన్న
నమ్మకంతో చరణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాకి
సంబంధించిన స్కిప్ట్ వర్క్ జరుగుతోందని
చెబుతున్నారు. గతంలో చరణ్ - త్రివిక్రమ్ కలిసి పెప్సీ యాడ్ కోసం
పనిచేశారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న మొదటి సినిమా ఇదే
అవుతుంది. దాంతో త్రివిక్రమ్ తరహా వినోదాన్ని చరణ్ అద్భుతంగా పండిస్తాడంటూ
అభిమానులు ఆనందంగా చెప్పుకుంటున్నారు.
'జల్సా' చిత్రంతో పవన్ కి ... 'జులాయి' చిత్రంతో అల్లు అర్జున్ కి ఘన విజయాలను సాధించి పెట్టిన త్రివిక్రమ్, ఈ సినిమాతో చరణ్ కి సంచలన విజయాన్ని అందించడం ఖాయమని అనుకుంటున్నారు. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ హీరోగా ఓ సినిమాని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. అలాగే 'నాయక్' ... 'ఎవడు' సినిమాలతో చరణ్ తీరికలేకుండా ఉన్నాడు. కనుక ఈ ప్రాజెక్టుల అనంతరం వీరి తాజా చిత్రం మొదలు కావొచ్చు.

Comments
Post a Comment