తెలుగు లెక్చరర్‌గా ప్రిన్స్ మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’ ?
మహేష్‌బాబు కథానాయకుడిగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ‘ దూకుడు’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు అనిల్
సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా మరోసారి ఆయన కథానాయకుడిగా ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న
విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. రొమాంటిక్
ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహిళా కాలేజ్‌లో తెలుగు లెక్చరర్‌గా మహేష్ కనిపించబోతున్నాడని ప్రచారంలో ఉంది . ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం గత కొన్ని రోజులుగా ‘చంద్రుడు ’, ఆగడు’ అనే టైటిల్స్
ప్రచారంలో వున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్‌ని చిత్ర బృందం పరిశీలిస్తోందని సినీ వర్గాల
సమాచారం. ఈ చిత్రానికి గా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Comments
Post a Comment