Skip to main content

చికాగో నగర వీధులలో వివేకానందుని నిలువెత్తు చిత్రపటాలు వెలిశాయి. ఆయన మహోపన్యాసం హిందూ ఝం ఝూ మారుతమని ఆయన ఈశ్వర ప్రేరిత ప్రవక్త అని పత్రికలు శ్లాఘించాయి.

"బలమే జీవనము బలహీనతే మరణం" అన్న స్వామి వివేకానంద ప్రవచనం జగద్విఖ్యాత. యువతకు స్పూర్తిగా చైతన్య దీప్తిగా భాసిల్లిన వివేకానంద స్వామి విలక్షణ జీవనశైలి, విశ్ర్ష్టమైన ఆయన సేవలు సింహావలోకనం చేసుకోవటం ఎంతైన అవసరము.
1863 జనవరి 12 న కలకత్తాలో విశ్వనాధ దత్తా, భువనేశ్వరి దంపతులకు వివేకానందుడు జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు నరేంద్రుడు అని పేరు పెట్టారు. బాల్యం నుండి ఆయనలో ధైర్య సాహసాలు, నిరుపమాన దీక్షాశక్తి, అద్భుత ధారణ శక్తి ప్రస్పుటమయ్యాయి. కళాశాలలో చదువుతుండగా తండ్రి విశ్వనాధ దత్త మరణించటంతో కుటుంబ భారం ఆయనపై పడినది. మరో వైపు వైరగ్య భావాలు అంకురించాయి. చిన్నప్పటి నుంచి నరేంద్రుడి కలల్లో ఒక దివ్య శక్తి వెలుగు రూపంలో గోచరించేది. ఈ తరుణం లో దక్షిణేశ్వరంలో వున్న రామకృష్ణ పరమహంసతో పరిచయము ఏర్పడింది. తొలి సారి రామకృ ష్ణ పరమహంసను కలువగానే "ఏంత కాలమునకు వచ్చితివోయి? ఇంతకాలము నాపై నీకింత నిర్దాక్షిణ్యమేలనయ్యా?" ప్రపంచ ప్రజల తుచ్చ ప్రసంగాలతో నా చెవులు చిల్లులు పడుచున్నవి నాయనా! నీవు నరుడను సనాతన ఋషివి. ఇప్పుడు మానవ కోటి బాధలను రూపుమాపుటకై అవతరించిన నారాయణుడవు." అంటూఆనందముతోఆలింగనము చేసుకున్నారు. అనతి కాలంలోనే నరేంద్రుడు రామకృష్ణుని ముఖ్య శిష్యుడైనాడు. ఆయన మనోహర గానమాధుర్యం రామకృష్ణుని ఆనందసాగరంలో ముంచెత్తేది. 1886 లో పరమహంస నిర్యాణం చెందినాక నరేంద్రుడు పరివ్రాజకుడుగా యావద్బారత పర్యాటన చేశారు. వివేకానంద నామము స్వీకరించారు. దేశ సముద్దరణకు, భారతజాతి పునర్జీవనానికి అహర్నిశలు తపించారు.
స్వామి వివేకానంద గొప్ప ఉపన్యాసకుడు. ఆయన ప్రసంగం ఎంతటివారినైన అలరించేది. స్వామిని ఆ రోజులలో "లైట్నింగ్ ఆరేటర్" అని పిలిచేవారు. 1893 సెప్టెంబరు లో అమెరికాలోని చికాగోలో జరిగిన మహాసభల్లో అయన చేసిన ప్రసంగం ఈ రోజుకూ ప్రపంచదేశాలంతట ప్రతి ధ్వనిస్తుంది. ఈ సభలో హిందూ వేదాంత భేరిని మ్రోగించిన వివేకానంద ఇలా చెప్పారు. "ఎన్నటికైన విశ్వమానవ మతమనేది ఒకటి వెలసినది అంటే, అది తాను ప్రకటించిన భగవంతునిలా దేశకాలాతీతమై, అనంతమై ఉండాలి. కృష్ణుని అనుసరించే వారి మీద, సాధు పురుషుల మీద, పాపాత్ముల మీద అందరిమీద తదీయ భాను దీప్తి ప్రసరించాలి. అది బ్రాహ్మణ మతంగా కాని, మహమ్మదీయ మతంగా కాని ఉండక, వీటన్నింటిని తనలో ఇముడ్చుకొని ఇంకా వికాసం పొందటానికి అనంతమైన అవకాశం కల్గి ఉండాలి.
స్వామి వాక్పటిమకు అనంతమైన మేధా సంపత్తికి శ్రోతలు ముగ్దులయ్యారు. చికాగో నగర వీధులలో వివేకానందుని నిలువెత్తు చిత్రపటాలు వెలిశాయి. ఆయన మహోపన్యాసం హిందూ ఝం ఝూ మారుతమని ఆయన ఈశ్వర ప్రేరిత ప్రవక్త అని పత్రికలు శ్లాఘించాయి. నాలుగు సంవత్సరాల పాటు అమెరికా, ఐరోపా ఖండాలలో పర్యటించి, అద్భుతంగా ఉపన్యాసాలు ఇచ్చి, వేదాంత కేంద్రాలు నెలకొల్పి, అనేకులను శిష్యులుగా స్వీకరించి 1897 లో స్వదేశానికి తిరిగి వచ్చినారు. దీనితో భారతదేశంలో నూతన శకం ప్రారంభమైనది. వెనువెంటనే స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ స్థాపించారు.
వివేకానందుడు గొప్ప దేశభక్తుడు. భారతదేశ ఘనతను వర్ణిస్తూ ఆయన ఇక్కడనే ఈ ఒక్క దేశంలోనే మానవ హృదయం అతి విశాలమై అనంత విస్తృతిని పొంది తోటి మానవ జాతినే కాక పశుపక్ష్యాదు లతో సహా సమస్త ప్రాణికోటి చేత సర్వజగత్తు ఉచ్చంనీచం లేకుండా తనతోనే వున్నట్లు భావన చెయగలిగింది అన్నారు. మనలోని లోపాలు వివరిస్తూ "మనంతట మనం పని చేయం, పనిచేసే వారిని పనిచేయనీయం . వారిని విమర్శించి తప్పులెంచి అవహేళన చేస్తాం. మానవ జాతిపతనానికి ముఖ్యమైనదీ లక్షణమే" అన్నారు. దైవ విశ్వాసం కంటె మానవ విశ్వాసం ముఖ్యమని బోధిస్తూ "మూడు వందల ముఫై కోట్ల దేవతలలోనూ నమ్మకమున్నా నీలో నీకే విశ్వాసం లేకపోతే నీకు ముక్తి లేదు. దేశ ప్రజలందరికి ఆత్మవిశ్వాసం క్రియా శూరత్వము కావాలి. ఈ అవసరము నాకు స్పస్టంగా కనిపిస్తుంది "అని నొక్కి చెప్పారు. అంతేకాక "మనం సోమరులము, ఏ పని చేయలేము ముందు మనమంతా సోమరితనాన్ని వదిలి కష్టించి పనిచెయటం అలవర్చుకోవాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది" అంటూ యువతరాన్ని ప్రేరేపించిన మహాశక్తి, గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద.

Comments

  1. India yet to understand Swami Vivekananda.He had spoken out so greatly about the salient qualities of both the east and the west.and at the same time,the worst sides of the both hemispheres.He showed his words in his daily life also.he did excersize with dumbells and revealed physical fitness as important as meditation. he gave more preference to practicality in religion.He had a capacity of establishing a new religion but he never liked to cheat common people for the sake of his fame.He told prophecy that we can not win the west in physical plane, because they are far ahead in this game.He always uttered that now the india needs the ideal of kshtriya.

    ...murthy

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

భక్త ప్రహ్లాద 1967 పాటల పుస్తకం

భక్త ప్రహ్లాద 1967 భక్త ప్రహ్లాద 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన  ప్రహ్లాదునిని  కథ ఆధారంగా వచ్చిన సినిమా. దీనికి మునుపు 1931, మరియు 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా  ఎస్.వి. రంగారావు ,  ప్రహ్లాదుడిగా రోజారమణి , ప్రహ్లాదుడి తల్లిగా  అంజలీ దేవి  నటించారు బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం మంచి పేరు తెచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు.

కమ్మ,రెడ్డి,కాపు ఒకే కులం

కమ్మ,వెలమ,రెడ్డి,కాపు,ఒకే కులం   మధ్య యుగములో గ్రామాధికారిగా వ్యవహరించే కాపును రెడ్డి అని గౌరవపూర్వకముగా సంబోధించేవారు. ప్రముఖ బ్రిటిష్ సామాజిక శాస్త్రజ్ఞుడు ఎడ్గార్ థర్ స్టన్ 'రెడ్డి' అను బిరుదు కలవారిని 'కాపు' కులంలో భాగంగా పేర్కొన్నాడు కాపులు రెడ్లు వేరువేరు కులాలు వారుకాదు.వారిద్దరూ ఒకేకులస్తులు.రెడ్లు ఇప్పటికీ తమకులం కాపు అని పేర్కొంటారు అని చేగొండి హరిరామ జోగయ్య సమాచార శాఖా మంత్రిగా ఉన్నరోజుల్లో అన్నారు."నిజాం రాజ్యంలో కులాలు తెగలు" అనే గ్రంధంలో(1920) సయ్యద్ సిరాజుల్ హసన్ కాపుల గురించి వివరంగా రాశారు:కాపు,కుంబి,రెడ్డి-ద్రావిడ జాతికి చెందిన వ్యవసాయదారుల కులం.ఆదిరెడ్డికి పుట్టిన ఏడుగురు కొడుకులలోంచి పుట్టిన కాపులు 10 ఉప కులాలుగా విడిపోయారు.1.పంచరెడ్లు(మోటాటి,గోదాటి,పాకనాటి,గిట్టాపు,గోనెగండ్లు) 2.యాయ 3.కమ్మ 4.పత్తి 5.పడకంటి 6.శాఖమారి 7.వక్లిగర్ లింగాయతు 8.రెడ్డి 9.పెంట 10.వెలమ.మోటాటి రెడ్లు మోటాటి కాపుల ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకుంటారు.చిట్టాపుకాపులు మాసం మద్యం ముట్టరు.గోడాటికాపుస్త్రీలు పైట కుడివైపుకు వేస్తారు.వారిలో వితంతువివాహాలున...

ఆదర్శ కుటుంబం లిరిక్స్

https://www.saavn.com/p/album/telugu/Aadarsa-Kutumbam-1969/JpW3TvCCtNI_ ఆదర్శ కుటుంబం