క్లుప్తంగా ‘అవును’ చిత్రం ఓ క్రైం సన్పెన్స్ థ్రిల్లర్. మోహిని(పూర్ణ)
ఆమె భర్త హర్ష(హర్షవర్ధన్ రాణే) ల చుట్టూ కథ తిరుగుతుంది. కొత్తగా
పెళ్ళయిన వీరి జంట గండిపేట్ దగ్గరలో క్లాసిక్ హోమ్స్ అనే ప్రదేశంలో
నివసిస్తూ ఉంటారు. ఇంట్లోకి వెళ్లిన అనతికాలంలోనే ఆ ఇంట్లో కొన్ని
విచిత్రమయిన సంఘటనలు జరుగుతాయి. ఒకఆత్మ మోహినిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
ఇదిలా జరుగుతుండగా పక్కన ఇంట్లో పిల్లాడు విక్కి తన చనిపోయిన తాతతో
మాట్లాడుతుంటాడు. విక్కికి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి కాని ఎవరు అతనిని
నమ్మరు. మోహిని వాళ్ళ ఇంట్లో కెప్టన్ రావు ఆత్మ ఉందని ఆ అబ్బాయి చెప్తాడు.
హర్ష మరియు మోహిని హనీమూన్ కోసం ప్యారిస్ వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. కాని
దయ్యం మోహినిని మరింత ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టడంతో పరిస్థితి
మారిపోతుంది ఆ దయ్యం నుండి పారిపోవాలని ప్రయతించిన మోహిని ప్రయత్నాలు విఫలం
అవుతాయి. మెల్లగా విక్కి తల్లి తండ్రులు, చుట్టుపక్కల వాళ్ళు కెప్టన్ రావు
ఆత్మ నిజంగానే ఉందని తెలుసుకొని మోహినిని కాపాడడానికి ప్రయత్నిస్తారు.
వాళ్ళ ప్రయత్నం సఫలం అయ్యిందా? ఈ కెప్టన్ రావు ఎవరు? అనేది కీలకం.
+ points,-points
పూర్ణ నటనలో మెప్పించింది. ఈ పాత్రకి ఆర్ జే కాజల్ అందించిన గాత్రం న్యాయం చేసింది. హర్షవర్ధన్ పరిది చిన్నదైనా బాగా చేశాడు. కీలక సన్నివేశాలలో అయన నటన ఆకట్టుకుంది. ప్రముఖ యాంకర్ గాయత్రి భార్గవి యాక్టింగ్ ఓకే. రవి బాబు చేసింది చిన్న పాత్రనే అయినా కీలకమైంది. ఆయన పోలీసు ఆఫీసర్ గా ఆకట్టుకున్నారు. విక్కి పాత్రలో నటించిన పిల్లాడు చాలా బాగా చేశాడు. సుధా,రాజేశ్వరి ఇంకా, చలపతి రావు వారి పాత్రల పరిధి మేరకు చేశారు. కథనంలో వేగం, చివరి వరకు సస్పెన్స్ కొనసాగడం రక్తి కట్టించింది. సౌండ్ ఎఫెక్ట్స్, నేపధ్య సంగీతం అద్భుతం కాకపోయినా ఫర్వాలేదు. అయితే, దయ్యం పాత్రలో కీలక మార్పులను సరిగ్గా చూపించలేకపోయారు. ఇది హారర్ చిత్రం కాబట్టి అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకోవటం విశేషమే.
సినిమాటోగ్రఫీ, లైటింగ్ స్కీమ్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ కొన్ని లోటుపాట్లు మినహా బావుంది. డైలాగ్స్ పరవాలేదు.శేఖర్ చంద్ర అందించిన నేపధ్య సంగీతం, రీ రికార్డింగ్ పనులు చిత్రానికి ప్రధాన ఆకర్షణ.

Comments
Post a Comment