Skip to main content

'ఎవడు' చిత్రం కోసం '' గాజువాక సెంటర్లో అయ్యో పాపం'' అనే ఐటంసాంగు

http://mimg.sulekha.com/telugu/yevadu/stills/yevadu-01.jpgదేవిశ్రీ ప్రసాద్ 'ఎవడు' చిత్రం కోసం ఓ ఐటంసాంగ్ ను కంపోజ్ చేశాడు. రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం దేవిశ్రీ '' గాజువాక సెంటర్లో అయ్యో పాపం'' అనే ఐటంసాంగును సిద్ధం చేశాడు.  'గబ్బర్ సింగ్' చిత్రంలో 'కెవ్వు కేక' అనే పాటలో ఆ మాట ప్రతి పాదం చివరన మాంచి ఊపుతో వస్తుంది. అలాగే ఈ పాటలో ప్రతి పాదం చివరన 'అయ్యోపాపం' అని వస్తుందట. ఈ ఐటంసాంగును ఏ మెరుపు తీగ పై చిత్రీకరిస్తారో తెలియదుగానీ, పాట మాత్రం చరణ్ కి ఎంతగానో నచ్చిందని అంటున్నారు. అద్భుతంగా వచ్చిన ఈ ఐటంసాంగుని అనూహ్యమైన స్థాయిలో తెర కెక్కించ డానికి వంశీ పైడిపల్లి సన్నాహాలు చేస్తున్నాడట. భారీ బడ్జెట్టుతో నిర్మితమౌతోన్న ఈ సినిమాలో సమంతా - అమీ జాక్సన్ కథానాయికలుగా అలరించనున్నారు.

Comments