భక్త ప్రహ్లాద 1967 భక్త ప్రహ్లాద 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన ప్రహ్లాదునిని కథ ఆధారంగా వచ్చిన సినిమా. దీనికి మునుపు 1931, మరియు 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా ఎస్.వి. రంగారావు , ప్రహ్లాదుడిగా రోజారమణి , ప్రహ్లాదుడి తల్లిగా అంజలీ దేవి నటించారు బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం మంచి పేరు తెచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు.
తెలుగు సినిమా లిరిక్స్ అండ్ సాంగ్స్
Comments
Post a Comment