Skip to main content

తెలుగు చలన చిత్ర రంగ పరువు నిలిపాడు దర్శక ధీరుడు రాజమౌళి.

raja_inner
        తెలుగు చలన చిత్ర రంగ పరువు నిలిపాడు దర్శక ధీరుడు రాజమౌళి.  రెండేళ్ళపాటు నిర్విరామ  కృషి సలిపి తెరకెక్కించి  ‘ఈగ’ కష్టం ఇంకా ఫలితాలనిస్తూనే ఉంది. కలెక్షన్ల పరంగానూ తన ఆధిక్యాన్ని కనబరిచిన ఈ మూవీ ఇప్పుడు ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ఆస్కార్ నామినీలో చోటు దక్కించుకుంది. ఇండియా నుండి ఉత్తమ చిత్ర ఎంపిక కోసం వివిధ భాషల నుండి 12 సినిమాలను ఎంపిక చేయగా తెలుగు నుండి కేవలం ఈగ సినిమా ఒక్కటే ఎంపిక అయింది. ఈ నెల 18 నుండి 26 వరకు హైదరాబాదులో ఈ పన్నెండు చిత్రాలను జ్యూరీ సభ్యులు చూసి అందులో ఎంపికైన ఉత్తమ చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్ కి పంపిస్తారు. తమిళ్ నుండి రెండు, మలయాళం నుండి రెండు, హిందీ నుండి ఏడు సినిమాలు ఎంపిక కాగా తెలుగు నుండి కేవలం ఈగ సినిమా ఒక్కటే ఎంపిక కావటం విశేషమే కాదు, టాలీవుడ్ కు ఉపశమనం కూడా.. వివిధ భాషలకు చెందిన మిగతా చిత్రాలు ఈ విధంగా ఉన్నాయి.
•    ఈగ (తెలుగు)
•    కహాని (హిందీ)
•    బర్ఫీ (హిందీ)
•    హీరోయిన్ (హిందీ)
•    ఫెర్రారీ కి సవారి (హిందీ)
•    గాంగ్స్ అఫ్ వసేపూర్ (హిందీ)
•    డర్టీ పిక్షర్ (హిందీ)
•    పాన్ సింగ్ తోమార్ (హిందీ)
•    వజకు ఎన్ 18/9 (తమిళ్)
•    7 ఎఎం అరివు (తమిళ్)
•    డియోల్ (మరాఠి)
•    ఆకశింతే (మలయాళం)

Comments

Popular posts from this blog

ఆదర్శ కుటుంబం లిరిక్స్

https://www.saavn.com/p/album/telugu/Aadarsa-Kutumbam-1969/JpW3TvCCtNI_ ఆదర్శ కుటుంబం

భక్త ప్రహ్లాద 1967 పాటల పుస్తకం

భక్త ప్రహ్లాద 1967 భక్త ప్రహ్లాద 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన  ప్రహ్లాదునిని  కథ ఆధారంగా వచ్చిన సినిమా. దీనికి మునుపు 1931, మరియు 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా  ఎస్.వి. రంగారావు ,  ప్రహ్లాదుడిగా రోజారమణి , ప్రహ్లాదుడి తల్లిగా  అంజలీ దేవి  నటించారు బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం మంచి పేరు తెచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు.

మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించండి ,గుడిని ,ఆ శిల్ప సౌందర్యాన్ని సృసించండి.

  మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించండి  ,గుడిని ,ఆ శిల్ప సౌందర్యాన్ని సృసించండి .ఈ క్రింది లింక్  ను నొక్కండి మీరు స్వయంగా గుడిని దర్శించిన అనుభూతిని పొందండి . http://www.view360.in/virtualtour/madurai/ ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటి పాత మదురై నగరపు జీవన విధానాన్ని కలిగి ఉంది. ఆలయ సముదాయం ముఖ్య దేవతలకు రెండు బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలు లేదా టవర్లకు నిలయంగా ఉంది, ఇవి అద్భుతమైన శిల్ప, చిత్రకళా రీతులతో ఉంది. ఆలయం తమిళ ప్రజలకు అతి ముఖ్యమైన చిహ్నంగా ఉంది, తమిళ సాహిత్యంలో అతి పురాతన కాలం నుంచీ ఈ ఆలయం ప్రస్తావించబడుతోంది, అయితే ఆలయ ప్రస్తుత రూపం 1600 సంవత్సరంలో నిర్మించబడిందని నమ్మిక.  హిందూ పురాణం ప్రకారం, శివుడు మీనాక్షిని [పార్వతి] పార్వతి అవతారాన్ని పెళ్లాడడానికి సుందరేశ్వర్ రూపంలో భూమ్మీదకు వచ్చాడు. మదుర పాలకుడు [మలయధ్వజ పాండ్య] చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతి ఒక చిన్న పాప రూపంలో భూమ్మీదికి వచ్చింది. పెరిగి పెద్దయిన తర్వాత ఆమె నగరాన్ని పాలించసాగింది. దేవుడు భూ మ్మీద అవతరించి ఆమెను పెళ్లాడతానని వాగ్దానం చేశాడు. ఆ పెళ్లి భూమ్మీద అ...