రామ్ చరణ్ హీరోగా వైజయింతీ మూవీస్ అశ్వనీదత్ అత్యున్నత సాంకేతిక విలువలతో... అత్యంత ప్రతిష్టాత్మకంగా,శ్రీను వైట్ల దర్శకత్వంలో మెగా చిత్రం
రామ్ చరణ్ హీరోగా వైజయింతీ మూవీస్ అశ్వనీదత్ అత్యున్నత సాంకేతిక విలువలతో... అత్యంత ప్రతిష్టాత్మకంగా,శ్రీను వైట్ల దర్శకత్వంలో మెగా చిత్రం .
చిరంజీవితో జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి ఎన్నో హిట్ చిత్రాలు అందించిన వైజయింతీ మూవీస్ తాజాగా రామ్ చరణ్ తో ఓ చిత్రం చేయటానికి ఎగ్రిమెంట్ చేసుకుంది. ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మించనున్నారు. రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. అత్యున్నత సాంకేతిక విలువలతో... అత్యంత ప్రతిష్టాత్మకంగా అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రామ్‌చరణ్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయే విధంగా ఈ సినిమాను రూపొందించాలని దర్శకుడు శ్రీను వైట్ల కృషి చేస్తున్నాడు ..అలాగే రామ్‌చరణ్ కూడా వీవీ వినాయక్ దర్శకత్వంలో ‘నాయక్' చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం 2013 సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే పైడిపల్లి వంశీ దర్శకత్వంలో ‘ఎవడు' చిత్రం చేస్తున్నారు. అల్లు అర్జున్ గెస్ట్ రోల్ లో కనిపించే ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా జరిగింది. ఇక బాలీవుడ్ ‘జంజీర్'రీమేక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తవగానే ఈ సినిమా సెట్స్‌కి వెళుతుంది. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Post a Comment