మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించండి ,గుడిని ,ఆ శిల్ప సౌందర్యాన్ని సృసించండి .ఈ క్రింది లింక్ ను నొక్కండి మీరు స్వయంగా గుడిని దర్శించిన అనుభూతిని పొందండి .
http://www.view360.in/virtualtour/madurai/
ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటి పాత మదురై నగరపు జీవన విధానాన్ని కలిగి ఉంది. ఆలయ సముదాయం ముఖ్య దేవతలకు రెండు బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలు లేదా టవర్లకు నిలయంగా ఉంది, ఇవి అద్భుతమైన శిల్ప, చిత్రకళా రీతులతో ఉంది. ఆలయం తమిళ ప్రజలకు అతి ముఖ్యమైన చిహ్నంగా ఉంది, తమిళ సాహిత్యంలో అతి పురాతన కాలం నుంచీ ఈ ఆలయం ప్రస్తావించబడుతోంది, అయితే ఆలయ ప్రస్తుత రూపం 1600 సంవత్సరంలో నిర్మించబడిందని నమ్మిక.
హిందూ పురాణం ప్రకారం, శివుడు మీనాక్షిని [పార్వతి] పార్వతి అవతారాన్ని పెళ్లాడడానికి సుందరేశ్వర్ రూపంలో భూమ్మీదకు వచ్చాడు. మదుర పాలకుడు [మలయధ్వజ పాండ్య] చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతి ఒక చిన్న పాప రూపంలో భూమ్మీదికి వచ్చింది. పెరిగి పెద్దయిన తర్వాత ఆమె నగరాన్ని పాలించసాగింది. దేవుడు భూ మ్మీద అవతరించి ఆమెను పెళ్లాడతానని వాగ్దానం చేశాడు. ఆ పెళ్లి భూమ్మీద అత్యంత పెద్ద కార్యక్రమంగా భావించబడింది, ఎందుకంటే భూమండలం మొత్తంగా మదురై సమీపానికి వచ్చి చేరింది. మీనాక్షి సోదరుడు విష్ణు, పెళ్లి జరిపించడానికి తన పవిత్ర స్థలమైన వైకుంఠం నుంచి తరలి వచ్చాడు. దేవతల నాటకం కారణంగా, ఇతడు ఇంద్ర దేవుడి వంచనకు గురై, రావడం కాస్త ఆలస్యమైంది. ఈలోగా, పెళ్లి తిరుప్పరాంకుండ్రంకి చెందిన స్థానిక దేవుడు పవలాకనైవాల్ పెరుమాళ్ ద్వారా జరిగిపోయింది. ఈ పెళ్లి గురించి ప్రతి ఏటా మదురైలో 'చిత్తిరై తిరువిళ' గా జరుపుకుంటారు. మదురైలో నాయకరాజుల పాలనలో, పాలకుడు తిరుమలై నాయకర్ 'అళకర్ తిరువిళా' కు 'మీనాక్షి పెళ్లి' కి జత కుదిర్చాడు. అందుచేత 'అళకర్ తిరువిళా' లేదా 'చిత్తిరై తిరువిళ' పుట్టింది.
................................................................................................................మీ రామ్ సాగి
మధురై పేరుకు తగినట్లుగా మధురమైన ఆలయం. సుమధురమైన మీనాక్షి అమ్మవారు.
ReplyDeleteచాలా సంవత్సరాల క్రితం చూసిన అమ్మవారి ఆలయాన్ని మళ్ళీ కళ్ళకి కట్టారు. చాలా సంతోషంగా ఉంది. దన్యవాదాలు. మేము చూసినప్పుడు కోనేరులో నీరూ, తామర పూలు ఉన్నాయి. ఏదేమైనా అద్భుతమైన పోస్ట్. ఇలాంటివే మరిన్ని ఆశిస్తున్నాను.
ReplyDeletethank u krishna garu
ReplyDelete