Skip to main content

తెలుగువారి గుండె చప్పుడు మన ఎన్.టి.ఆర్. జోహార్......ఎన్.టి.ఆర్..... జోహార్ .

NTR Cinema Lifeజన్మించిన తేది : 1923 మే 28వ తేది, కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామం
తల్లిదండ్రులు : లక్ష్మయ్య చౌదరి, వెంకట్రావమ్మ
చదివినది : 1947లో బి.ఎ. ఉత్తీర్ణత
మొదటి ఉద్యోగం : సబ్ రిజిస్టార్
కుమారులు : జయకృష్ణ , సాయికృష్ణ , హరికృష్ణ , మోహనకృష్ణ , బాలకృష్ణ , రామకృష్ణ , జయశంకర్ కృష్ణ
కుమార్తెలు : లోకేశ్వరి , పురంద్రీశ్వరి , భువనేశ్వరి , ఉమామహేశ్వరి
తొలి చిత్రం : 1949 లో "మనదేశం"
చివరి చిత్రం : మేజర్ చంద్రకాంత్
తెలుదుదేశం ఆవిర్భావం : 1982 మార్చి 29న మధ్యాహ్నం 2-30 గం.లకు.
ప్రభుత్వ ఆవిర్భావం : 1983 జనవరి 9వ తేది
మరణం :1996 జనవరి 18వ తేది


NTR with Mother & Brother
నందమూరి తారక రామారావు కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో 28-05-1923న జన్మించారు. తండ్రి లక్ష్మయ్య చౌదరి, తల్లి వెంకట్రావమ్మ. ఎన్.టి.ఆర్, పెద్దనాన్న రామయ్య-చంద్రమ్మ దంపతులకు సంతానం లేకపోవడంతో వారికి ఎన్.టి.ఆర్ దత్తపుత్రుడుగా మారిపోయారు. వాళ్ళ్లు చాలా గారాబంగాపెంచారు. ఇద్దరు తండ్రులూ, ఇద్దరు తల్లులకు ముద్దుల కొడుకుగా పెరిగాడు. వీరిది మోతుబరి రైతుకుటుంబం. ఎన్.టి.ఆర్ అక్షరాభ్యాసం నిమ్మకూరులోనే జరిగింది. నిమ్మకూరులో ఆరోజులలో ఐదవ తరగతి వరకే ఉంది. అదీ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాల. అతనికి ఓనమాలు నేర్పిన ఉపాధ్యాయుడు వల్లూరు సుబ్బారావు. పెద్దబాల శిక్ష మొదలుకొని భారత రామాయణాలను నేర్చుకొన్నాడు. సాహిత్య, సాంస్కృతిక సౌరభాలు శైవంలోనే గుభాళించాయి. పౌరాణిక సాహిత్యం పట్ల అనురక్తి ఆనాడే ఏర్పడింది. అతని గొంతు అందరికి ఆకర్షణీయంగా ఉండేది. చిన్నతనంలోనే బాలరామాయణం వల్లెవేయడంలో ప్రావీణ్యం సంపాదించారు. కంఠంలో ఓప్రత్యేకత ఉండేది. ముత్యాలవంటి దస్తూరీ ఉండేది. చిత్రకళలో కూడా మంచి నేర్పు సంపాదించారు. ఇక రూపం విషయంలో అతను స్పురద్రూపి. నిండుగా అందంగా ఉండేవారు. శ్రమైకజీవనసౌందర్య బీజాలు చిన్నతనంలోనే ఆయన మనస్సులో గాఢంగా నాటుకున్నాయి. చదువుకుంటూనే పొలం పనులకు వెళ్ళ్లేవారు. ఊరిలోని జాతరలలో నాటకాలువేసేవారు. అందులో అయన బాలరామాయణగానం ఒక ప్రత్యేకాకర్షణ. ఊళ్ళ్లోని ఐదవ తరగతి తర్వాత విజయవాడ వన్ టౌన్ లోని గాంధీ మున్సిపల్ హైస్కూల్లో ప్రవేశించారు. స్కూలు పైనల్ అక్కడే పాసయ్యారు. తర్వాత విజయవాడలోనే ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్ కాలేజీలో ఇంటర్ మీడియట్ లోప్రవేశించారు. అదే సమయంలో తండ్రి వ్యవసాయం దెబ్బతిన్నది. తండ్రి విజయవాడలోనే పాడిపశువుల పెంపకం చేపట్టారు. రామారావు చదువుసాగిస్తూనే సైకిల్ పై హొటళ్ళ్లకు పాలుపోసి వస్తూ తండ్రికి సహకరించేవారు.
NTR with Mother & Brother
ఇంటర్ లో విశ్వనాథ సత్యనారాయణ రామారావుకు గురువు. ఆయన రాసిన "రాచమల్లుని దౌత్యం" అనే నాటకంలో ఎన్.టి.ఆర్. నూనూగు మీసాలతోనే "నాగమ్మ" అనే హీరోయిన్ వేషం వేశారు. "మీసాల నాగమ్మ"గా బహుమతి కూడా కొట్టేశాడు. అలా జరిగిన తొలి రంగస్థల ప్రవేశం ఆయనలో కళారంగంపట్ల ఆసక్తిని పెంచింది. ఇంటర్ సెకండ్ ఇయర్లో "అనార్కలి"లో సలీంగా నటించి ప్రథమ బహుమతి పొందారు. ఆ ఉత్సాహంతోనే నేషనల్ ఆర్ట్ థియేటర్, ఎంగ్ ఆంధ్రా అసోసియేషన్ల ఆధ్వర్యంలో నాటక ప్రదర్శనలిచ్చి, ఔత్సాహిక కళాకారుడిగా రూపొందారు. 1942 మేలో మేనమామ కూతురు కొమరవోలు మునసబు కాట్రగడ్డ చెంచయ్య కూతురు బసవతారకంతో రామారావుకు 20వ యేట వివాహం అయింది. నాటకాభిరుచి, వైవాహిక జీవితంతో ఇంటర్ ఫేయిలయ్యారు. ఖాళీగా ఉండక చిన్న చిన్న ఉద్యోగాలూ, వ్యాపారాలూ చేశారు. సౌండ్ రికార్డింగ్ శిక్షణ కోసం బొంబాయి వెళ్ళ్లారు. అక్కడే ఒక ఆంధ్రామెస్ సడిపారు. ఇవేమీ లాభం లేక పోవడంతో మళ్ళ్లీ విజయవాడకు వచ్చి తండ్రి పాలవ్యాపారానికి తోడుగా పొగాకు-వ్యాపారం ప్రారంభించారు. కష్టపడి ఇంటర్ పాసయ్యారు. గుంటూరు ఎ.సి.కాలేజీలో బి.ఎలో జాయిన్అయ్యారు. అక్కడ కూడా ఆయన నటనాజీవితం కొనసాగింది. కొంగర జగ్గయ్య ఆయనకు ప్రత్యర్థి. ఇరువురు పరిషత్ పోటీలకు కూడా వెళ్ళ్లేవారు. కాలేజీలో వేసిన "నాయకురాలు" నాటకంలో ఎన్.టి.ఆర్. నలగామరాజు. దానితో అతను ప్రముఖ దర్శకులు సి.పుల్లయ్య దృష్టిలోపడ్డారు. అందగాడు, మంచికంఠం ఆకర్షించే నటన. ఇది చూసి పుల్లయ్య "సినిమాలో అవకాశం ఇస్తాను మద్రాసు రమ్మని" ఉత్తరం రాస్తే బి.ఎ పూర్తి కాకుండా సినిమాలలోకి రానన్నారు. 1947లో రామారావు బి.ఎ. పూర్తిచేశారు. అప్పటికే ఆయనకు ఒక కొడుకు రామకృష్ణ జన్మించాడు.

సినీవినీలాకాశంలో ధ్రువతార

NTR
మద్రాసులో శోభనాచల స్టూడియోలోకి అడుగుపెట్టి, ఒక 5'-10"ల అందగాడు గంభీరంగా నడిచివస్తుంటే "ఇలాంటివాడు నా చిత్రానికి హీరో అయితే ఎంత బాగుండును" అని బి.ఎ.సుబ్బారావు మనసులో అనుకుంటుండగానే", బి.ఎ.సుబ్భారావు గారు ఎక్కడ ఉంటారని ఎన్.టి.ఆర్. అడగడం తర్వాత వారి పరస్పర పరిచయాలూ ఇవన్నీ సుబ్బారావు మనస్సుమీద చెరగని ముద్రవేశాయి. స్క్రీన్ టెస్టులూ, ఇతర పరీక్షలూ ఏమీ అవసరంలేదని త్రోసిపుచ్చి సుబ్బారావు వెంటనే వెయ్యి నూటపదహార్లు అడ్వాన్సుగా ఇచ్చి కాంట్రాక్టుపై సంతకం చేయించుకున్నాడు. అదే ఎన్.టి.ఆర్. తొలి సంపాదన, అది ఆనాడు పెద్ద మొత్తం. హొటల్ రూం అద్దె 4/- రూ.లు, భోజనం 0-50పైసలు. ఇక అటు పల్లెటూరిపిల్ల ప్రారంభం కాకముందే రామారావు ఎల్.వి.ప్రసాద్ "మనదేశం"లో సబ్ ఇన్ స్పెక్టర్ పాత్ర ధరించి మొట్టమొదటిసారి నటించారు. "కష్టపడి కానిస్టేబుల్ స్ఠాయి నుండి సబ్ ఇన్ స్పేక్టర్ స్ఠాయికి ఎదిగాను" అనే ఒకే ఒక్క డైలాగు చెప్పి లాఠీ ఝుళిపిస్తూ నిజంగానే సమరయోధుల ఎక్స్ట్ ట్రా పాత్రధారులను బాది తరిమి కొట్టారు. ఒక్క ఈ తొలి సన్నివేశంలోనేకాదు 40 ఎండ్ల సినీజీవితంలో ఇలానే ఆవేశంతో, అంకితభావంతో నటించారు. ఎన్.టి.ఆర్. సినిమా చరిత్ర నాలుగున్నర దశాబ్దాలు. 1949 లో జైత్రయాత్ర "మనదేశం"తో ప్రారంభం అయ్యింది. మధ్యలో కొంత రాజకీయ విరామం. తర్వాత 1993లో "మేజర్ చంద్రకాంత్"తో ముగిసింది. ఇందులో కేవలం సినీజీవితం 33 సంవత్సరాలు. తొలి చిత్రం "మనదేశం"లో ఎంత ఆవేశంగా నటించారో చివరి చిత్రం "మేజర్ చంద్రకాంత్"లోనూ తన 70వ ఏట అంతే ఆవేశంగా, అంతే ఉద్వేగభరితంగా నటించారు. ఈ వేషంలో ఆవేశం లేకుంటే రామారావు లేడు. హావభావాలలోనూ ప్రతి అంశంలోనూ ఆత్మవిశ్వాసం తొంగిచూస్తుంది. ఆత్మగౌరవం కోసం ప్రాణాలనైనా వదిలాడు గాని ఆత్మగౌరవాన్ని వదలలేదు. జీవితాంతం ఆయన సాగించిన 73 ఎళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో అడుగడుగునా పోరాటమే. తనకు అసమంజసమని తోచిన ప్రతి సందర్భంలోనూ ఘనమే. చివరికి మరణం కూడా పోరాటం పరిణామమే.
NTR
తెలుగు సినీ రంగంలో, రాజకీయ రంగంలోనూ, మానధనుడైన రారాజుగా చిరస్మరణీయుడయ్యారు. ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్ ల జయాపజయాలే తొలి తెలుగు సినిమా చరిత్ర. సినిమా పరిశ్రమకు గుర్తింపు, గౌరవం, హోదా, డబ్బు, తెచ్చిపెట్టిన ఘనత వీరిద్దరిదే, సినిమారంగం ఒక పరిశ్రమగా అభివృద్దిగాంచడానికీ, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సినిమాలు నిర్మించే స్ఠాయికి ఎదగడానికి ఎన్.టి.ఆర్. రాత్రింబవళ్ళు చేసిన కృషి, అతని క్రమశిక్షణ సమయపాలన ముఖ్యకారణాలు. అలుపు లేకుండా నిర్విరామంగా షూటింగ్ లలో పాల్గొని "పని రాక్షసుడు"గా పేరుపొందారు. ఆయన హీరోగా నటించిన డజన్లకొద్దీ సినిమాలు విడుదల అయిన సంవత్సరాలు అనేకం. 1964 లో 15 చిత్రాలలో నటించారు. 2-30గం ల రాత్రే లేస్తారు. కాలకృత్యాలు, యోగ, పూజ మొదలయినవి పూర్తిచేసుకుని, భోజనం చేసి సూర్యోదయానికి పూర్వమే మేకప్ వేసుకుని సిద్దంగా ఉండేవారు. స్టూడియోలో షూటింగ్ పైనే దృష్టి అంతా. మరో ద్యాస ఉండేదికాదు. కాలం విలువ చాలా బాగా తెలిసినవారు. కాలాన్ని పనిరూపంలోకి మార్చుకున్నారు. దానితో డబ్బూ, హొదా, కీర్తి సంపాదించుకున్నారు. ఆయన మొత్తం చిత్రాలు 295. వీటిలో 278 తెలుగు, 14తమిళం, 3 హిందీ. ఆయన పాత్రలలో కనిపించినంత వైవిద్యం మరో హీరోలో కనిపించదు. హీరో, విలన్, తండ్రి, కుమారుడు ఇలా అన్ని పాత్రలనూ ఏకకాలంలొ రక్తి కట్టించారు. ఆయన సినిమాలకు వసూళ్ళ్లలో అగ్రస్ఠానం. అవి రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించాయి. విజయ-వాహినీ స్టూడియోలు ఆసియాలోనే అతిపెద్ద స్టూడియోలుగా అభివృద్ధి చెందడానికి ఆయన తొలి సినిమాలు ఎంతో దోహదంచేశాయి. అనీ జూబ్లీ సినిమాలే ఆయన తొలి పారితోషికం ఐదువేలు, చివరి దశలో పాతిక లక్షల వరకూ తీసుకున్నారు. ఆయన ఒక వ్యక్తి కాదు. ఒక వ్యవస్థ. కళాకారుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన పట్టిందల్లా బంగారం అయింది. రాశిలోనేగాదు, వాసిలో కూడా ఆయన సినిమాలది అగ్రస్ఠానం. ఎన్.టి.ఆర్. నటించినన్ని పౌరాణిక చిత్రాలు ప్రపంచంలో మరే ఇతర నటుడూ నటించలేదు. రామునిగా, కృష్ణునిగా, వేంకటేశ్వరునిగా ఆయన పాత్రలను ప్రజలు అపరభగవంతునిగా ఆరాధించారు. ఒకే సినిమాలో నాయక, ప్రతినాయక పాత్రలు ధరించిన ఘనత కూడా ఆయనదే 43 పౌరాణికాలు, 12 చారిత్రకాలు, 55 జానపదాలు, 185 సాంఘీకాలు ఆయన చిత్రాలు. అందులో 141 శతదినోత్సవాలు లేక రజతోత్సవాలు జరుపుకున్నాయి. ఆరు సినిమాలు స్వర్ణోత్సవాలు జరుపుకున్నాయి. "లవకుశ 75 వారాలు ప్రదర్శించి రికార్డు సృష్టించింది. క్యాలెండరును తిప్పేసిన తొలి తెలుగు సినిమా"అది "నటరత్న" "పద్మశ్రీ" "విశ్వవిఖ్యాత నట సార్వభౌమ" బిరుదులు ఆయనకు లభించాయి.

"తెలుగుదేశం" అవతరణ

1982 మార్చి 21 తేదీన ఎన్.టి.ఆర్. జర్నలిస్ట్లులందరికీ పిలిచి రామకృష్ణ స్టూడియోలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తన గురించి తన కుటుంబం గురించి, తన ఆస్ఠిపాస్తుల గురించి, ప్రజలు చూపే ఆదరాభిమానాలకు, ప్రజానేవచేసి రుణం తీర్చుకోవాలనుకుంటున్న తన తపన గురించి వివరించారు. నటజీవితం విరమించుకున్నారు. పూర్తికాలం ప్రజలకోసం పనిచేయాలని అనుకున్నారు. పరోక్షంగా రాజకీయాలలోకి రాబోతున్నట్లు తెలిపినా, ఎన్ని ప్రశ్నలు వేసినా, రాజకీయ రంగప్రవేశం గురించి సూటిగా మాట్లడలేదు. 1982 మార్చి 29న కొత్తపార్టీ ఏర్పాటుకు సారథ్యసంఘం ఏర్పడింది. దానికి అధ్యక్షుడు ఎన్.ట్.ఆర్. కార్యదర్శి నాదెండ్ల భాస్కరరావు. మధ్యాహ్నం 2-30 గం. లకు కార్యకర్తలు, ఇతర జనంతో కూడిన బహిరంగ సభలో ఎన్.టి.ఆర్. ఉద్విగ్నంగా మాట్లాడుతు తాను "తెలుగు దేశం పార్టీ" అనే కొత్తపార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆప్రకటనకు హర్హధ్వానాలతో జనామోదం లభించింది. తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదం ఆనాటి నుండి ఊపందుకుంది.

ఒక కొత్త రూపంతో, కొత్త నినాదంతో, కొత్త ఒరవడితో, ఎన్.టి.ఆర్. ఒక మహొత్తుంగ తరంగమై లేచారు. ఆయన ఆశయాలకు జనం జేజేల వర్షం కురిపించారు. వర్ణ, వర్గ వివక్షలు ఏమీ అంటని మహొద్యమం అది. ఆయన సమ్మోహన శక్తికి తోడుగా, శక్తిహీనమై పలుచబడిపోయిన కాంగ్రెస్ అశక్తత కూడా ఆయన ఉద్యమానికి బలమైన ఊపిరిపోసింది. కాంగ్రెస్ నుండి కొంతమంది ప్రముఖ నాయకులు తెలుగుదేశంలో చేరారు. ఆయన పార్టీ ఫిరాయింపులపై ఆధారపడలేదు. ఆసక్తి కూడా చూపలేదు. కొత్తరక్తం కావాలనే కోరుకొన్నారు. అభిమాన సంఘాలు రామదండుగా పనిచేశాయి. పార్టీ నిర్మాణం రాష్ట్రస్థాయి నుండి గ్రామ స్థాయికి పాకింది. 1982 ఏప్రిల్ 11వ తేదీన నిజాం కాలేజీ గ్రౌండ్స్ల్ల్ల్లో లక్షలాది జనంతో చారిత్రాత్మకమైన మొట్టమొదటి మహాసభ - మహానాడు విజయవంతం అయింది. రామకృష్ణా స్టూడియో నుండి నిజాం కాలేజీ వరకు కొనసాగిన ర్యాలీ హైదరాబాద్ వీధులను దద్దరిల్లజేసింది. ఆ సభలో ఎన్.టి.ఆర్. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి, వారికి ఒక గుర్తింపు, గౌరవం తేవటానికి కుళ్ళ్లిపోయిన పాత వ్యవస్థను కూకటి వేళ్ళ్లతో పెకలించి నూతన వ్యవస్థను నిర్మించడానికి తాను కంకణం కట్టుకున్నానన్నారు. ఆయన మహొద్వేగంతో చేసిన తొలి ప్రసంగం జనాన్ని బాగా ఆకట్టుకుంది. అవినీతి, అక్రమాలకు తావులేని స్వచ్చమైన పాలన అందించడం కోసమే వచ్చానన్నారు. విజయవంతమైన ఆసభ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పార్టీ జెండా, సైకిల్ గుర్తు ఏర్పడ్డాయి.జనవరి 3వ తేదీ నుండి 70 రోజులపాటు అవిశ్రాంతగా రాష్ట్రమంతటా పర్యటించారు. 35000కి.మీ. తిరిగారు. మూలమూలకూ వెళ్ళి ఆయన సందేశాన్ని ప్రజలకు అర్థమయ్యే ధోరణిలో వాళ్ల హృదయాలకు హత్తుకునేలా బోధించారు. మహత్మగాంధీ తర్వాత ప్రేమాభిమానాలతో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించినది నందమూరి తారక రామారావు గారే.

ఆయన ప్రచారానికి వెళ్ళేటప్పుడు 40 సంవత్సరాలకు పూర్వం ఆయన కొనుగొలు చేసిన చెవర్‌లేట్ వ్యాన్ 1982 ఆగస్టులో 10,000 రూపాయలతో బాగుచేయించి ప్రచారానికి కావలసిన అన్ని సౌకర్యాలతో సిద్దపరచారు. అందులో ప్రచారానికి వెళ్ళే ముందు ఖాకీ దుస్తులు రెండు జతలు ,వెన్నె,తేనే, నిమ్మకాయల రసం, సోడా ఇవన్నీ వ్యాన్‌లో భద్రపరిచి వుంచేవారు. అవసరమున్నప్పుడల్లా వాటిని ఉపయోగించేవారు. దారిలో స్త్రీలు ,పురుషులు ఆబాలగొపాలం ఆయనకు దారి పొడవునా పుష్పహారాలతో ,మంగళహరతులతో జయ జయ ద్వానాలతో నాదస్వరాలతో ఆహ్వానించారు. ఆయన కోసం దారి పొడగునా ఎప్పుడు వస్తాడో ,ఎప్పుడు కనబడుతాడో అనే ఆశతో గంటల తరబడి వాననక,ఎండనక,రాత్రీ,పగలనక వేచి వుండేవారు. వెళ్ళిన ప్ర్తతిచోట పార్టీ కార్యకర్తలకు తన ఉపన్యాసాల క్యాసెట్‌లను, పోస్టర్‌లను, వాళ్లు అనుసరించవలసిన కార్యక్రమాలకు కావలసినవి ఇచ్చి బయలు దేరేవారు. ఆవ్యాన్ లోనే అల్యూమినియంతో తయారు చేసిన నిచ్చ్రెన పైన కూర్చోవడానికి ఆసనం ,లౌడ్‌స్పీకర్లు,మైక్ వంటి సౌకర్యాలన్నీ వున్నాయి. ప్రచార రథం పరిసరాలకు రాగానే ఇసుక వేస్తే రాలనంత జనం క్షణాల్లో పోగయ్యేవారు.యువకులు,పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా వేల సంఖ్యలో ప్రజలు తండోప తండాలుగా ఆ రథం చుట్టూ చేరిపోయేవారు.రామారావు గారి వాక్చాతుర్య ప్రసంగాలకు మంత్రముగ్ధులయ్యేవారు.

ఓట్ల వర్షాభిషేకంతో "ముఖ్యమంత్రి"

NTR
1983 జనవరి 5వ తేదిన జరిగిన పోలింగ్ లో తెలుగుదేశం సూపర్ హిట్ అయింది. నిలుచున్న అబ్యర్థులను చూసి ఎవరూ ఓటు వేయలేదు. ప్రతి ఓటరు తాను ఎన్.టి.ఆర్. కే ఓటు వేస్తున్నాననుకుని వేశారు. ప్రతిపక్షం వారి అంచనాలను, ఇతరుల నెగెటివ్ అంచనాలను మించి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం 203 స్థానాలను గెలుచుకుంది. చాలా ప్రాంతాల్లో ఎన్నికల్లో ఎన్.టి.ఆర్. నిలబెట్టిన రాజకీయ అనుభవం లేని నాయకులు కూడా గెలిచారు. అబ్యర్థుల్లో మూడు వంతులకు పైగా కొత్తవారే. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో అపూర్వఘట్టం. చాలా నియోజకవర్గాలలో వారెవరో కూడా తెలియని నాయకులు గెలిచారు. అత్యధికులు యువకులు, విద్యాధికులు, 125 మంది పట్టభుద్రులు, 20 మంది వైద్య పట్టభద్రులు, 8మంది ఇంజనీర్లు, 28మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, కేవలం 9 నెలల ప్రాయంగల ప్రాంతీయ పార్టీ, వందేండ్ల చరిత్రగల జాతీయపార్టీని చిత్తు చిత్తుగా ఓడించింది. ఎన్.టి.ఆర్. విశ్వవిఖ్యాత ఎన్నికల విజేతగా విరాజిల్లారు. కనివిని ఎరుగని ప్రజారాజకీయాలకు ఎన్.టి.ఆర్. నాంది పలికారు. రాజ్ భవన్ ను ప్రజలమధ్యకు తెచ్చారు. రాజకీయాలకు కొత్త నిర్వచనం పలికారు, ఆంధ్రప్రదేశ్ లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. అశేష ప్రజల సమక్షంలోనే ఎన్.టి.ఆర్. మంత్రి వర్గం ముందెన్నడూ లేనివిధంగా లాల్ బహదూర్ స్టేడియంలో 15మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేస్తుంటే స్టేడియం, లక్షలాది ప్రజల ఆనందేతిరేకంతో దద్దరిల్లింది. 
                                                                               .ఆంద్రదేశం ఉన్నంతకాలం అన్న N.T.R బ్రతికే ఉంటారు .తెలుగువారి గుండె చప్పుడు  మన ఎన్.టి.ఆర్. జోహార్........ ఎన్.టి.ఆర్.......... జోహార్ .
NOTE:ఈ వ్యాసం NTR.TELUGUDESAM.ORG నుంచి గ్రహించబడినది .

Comments

  1. చివరి సినిమా శ్రీ నాథ కవి సార్వభౌమ , తెలుగు దేశం వారికీ ఎంత శ్రద్ధ ఉన్నదో తెలుస్తోంది

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

భక్త ప్రహ్లాద 1967 పాటల పుస్తకం

భక్త ప్రహ్లాద 1967 భక్త ప్రహ్లాద 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన  ప్రహ్లాదునిని  కథ ఆధారంగా వచ్చిన సినిమా. దీనికి మునుపు 1931, మరియు 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా  ఎస్.వి. రంగారావు ,  ప్రహ్లాదుడిగా రోజారమణి , ప్రహ్లాదుడి తల్లిగా  అంజలీ దేవి  నటించారు బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం మంచి పేరు తెచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు.

కమ్మ,రెడ్డి,కాపు ఒకే కులం

కమ్మ,వెలమ,రెడ్డి,కాపు,ఒకే కులం   మధ్య యుగములో గ్రామాధికారిగా వ్యవహరించే కాపును రెడ్డి అని గౌరవపూర్వకముగా సంబోధించేవారు. ప్రముఖ బ్రిటిష్ సామాజిక శాస్త్రజ్ఞుడు ఎడ్గార్ థర్ స్టన్ 'రెడ్డి' అను బిరుదు కలవారిని 'కాపు' కులంలో భాగంగా పేర్కొన్నాడు కాపులు రెడ్లు వేరువేరు కులాలు వారుకాదు.వారిద్దరూ ఒకేకులస్తులు.రెడ్లు ఇప్పటికీ తమకులం కాపు అని పేర్కొంటారు అని చేగొండి హరిరామ జోగయ్య సమాచార శాఖా మంత్రిగా ఉన్నరోజుల్లో అన్నారు."నిజాం రాజ్యంలో కులాలు తెగలు" అనే గ్రంధంలో(1920) సయ్యద్ సిరాజుల్ హసన్ కాపుల గురించి వివరంగా రాశారు:కాపు,కుంబి,రెడ్డి-ద్రావిడ జాతికి చెందిన వ్యవసాయదారుల కులం.ఆదిరెడ్డికి పుట్టిన ఏడుగురు కొడుకులలోంచి పుట్టిన కాపులు 10 ఉప కులాలుగా విడిపోయారు.1.పంచరెడ్లు(మోటాటి,గోదాటి,పాకనాటి,గిట్టాపు,గోనెగండ్లు) 2.యాయ 3.కమ్మ 4.పత్తి 5.పడకంటి 6.శాఖమారి 7.వక్లిగర్ లింగాయతు 8.రెడ్డి 9.పెంట 10.వెలమ.మోటాటి రెడ్లు మోటాటి కాపుల ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకుంటారు.చిట్టాపుకాపులు మాసం మద్యం ముట్టరు.గోడాటికాపుస్త్రీలు పైట కుడివైపుకు వేస్తారు.వారిలో వితంతువివాహాలున
సింధు లోయ నాగరికత వెలికి తీయబడ్డ మొహంజో-దారో శిథిలాలు సింధు లోయ నాగరికత (క్రీ.పూ2700 - క్రీ.పూ.1750) ప్రస్తుత పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా మరియు సింధూ నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాధమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్ మరియు పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ , తుర్కమేనిస్తాన్ , ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరము మొదటగా వెలికి తీయుటచే ఇది సింధులోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది. సింధూ నాగరికత మెసొపొటేమియా మరియు ప్రాచీన ఈజిప్టు కంచు యుగాలకు సమకాలికమైన అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తించబడిన నాగరికతను హరప్పా నాగరికత గా పేర్కొంటారు. ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్నా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లోనే వెలువడ్డాయి. ఈ నాగరికతనే ఒక్కోసారి సింధూ ఘగ్గర్-హక్రా నాగరికత అని లేదా సింధూ-సరస్వతి నాగరికత గా కూడా అభి