ఈ క్రింది లింక్లను నొక్కండి కొన్ని అద్బుతమైన యానిమేషనులను చుడండి.
'రాం సాగి' అందించే అద్బుతం.......................!!!!
ఆధునిక
తరం విద్యార్ధులను ఆకర్షిస్తున్న కెరియర్లలో యానిమేషన్ ఒకటి. ఈ రంగంలో
భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకునే వారికి ఆకాశమే హద్దు, దీనిలోకి
ప్రవేశించాలంటే డిగ్రీ పూర్తిచేసే దాకా ఆగనక్కర్లేదు. ఇంటర్మీడియట్ పూర్తి
చేసిన విద్యార్ధలకు విభిన్నమైన యానిమేషన్ కోర్సులు స్వాగతం పలుకుతున్నాయి.
ఒకప్పుడు వినోద రంగానికి మాత్రమే పరిమితంగా ఉండే యానిమేషన్ ప్రక్రియ నేడు అన్ని రంగాల్లోనూ దర్శనమిస్తోంది. ఆటోమొబైల్, ఏరోస్పేస్, సివిల్, ఆర్కిటెక్చర్, విద్య, వైద్యం మందుల తయారీ, వాణిజ్య ప్రకటనలు మొదలైన ఎన్నో రంగాల్లో యానిమేషన్ ఉపయోగపడుతోంది. సృజన, సాంకేతిక పరిగ్జ్నానాల సమ్మేళనంగా యానిమేషన్ రంగం విస్తరిస్తోంది. వెబ్ యానిమేషన్, ఫీచర్ సినిమాలు, విడియో గేమ్స్, స్పెషల్ ఎఫెక్టులకు రూపకల్పన చేసేది యానిమేటర్లే. దేశీయంగా రూపొందిన ‘హనుమాన్’ లాంటి సినిమాల విజయం యానిమేషన్ కార్యకలాపాలకు ఊపునిచ్చింది.
‘నాస్కామ్’ అంచనా ప్రకారం వచ్చే ఏడాదికల్లా భారతీయ యానిమేషన్ మార్కెట్ విలువ రూ. 5,000 కోట్లకు చేరుతుంది. కానీ ఈ రంగంలో సుశిక్షితులైన నిపుణుల కొరత ఉంది. మనదేశంలో ప్రస్తుతం యానిమేషన్ పిపుణులు దాదాపు 6,000 మంది మాత్రమే. వచ్చే కొద్ది సంవత్సరాల్లో దాదాపు 40,000 మంది యానిమేటర్ల అవసరం ఏర్పడుతుందని ఈ రంగంలో అనుభవగ్జ్నులు చెపుతున్నారు.ఈ రంగంలో ప్రవేశించదల్చినవారికి డ్రాయింగ్, స్కెచింగ్ నైపుణ్యాలు అవసరం. కంప్యూటర్ ఉపయోగించటం తెలిసివుండాలి. ఆంగ్ల పరిగ్జ్నానం ఉంటే మంచిది. సృజనాత్మకత, ఊహాశక్తి, పరిశీలన ఉన్నవారు మంచి యానిమేటర్లుగా రాణించగలుగుతారు.
యానిమేషన్ డిప్లొమాలో చేరటానికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణలై ఉండాలి. ఇదే అర్హతతో యానిమేషన్ డిగ్రీ కోర్సులో కూడా ప్రవేశించవచ్చు. గ్రాడ్యుయేట్లు యానిమేషన్ పీజీలో చేరవచ్చు. ‘స్వల్పకాలిక కోర్సులు చేస్లే ఎంట్రీ స్థాయి ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. కానీ ఈ రంగంలో కెరియర్ తీర్చదిద్దుకోవాలంటే లాంగ్ టర్మ్ కోర్సులు చేయటమే మంచి’దని నిపుణులు సూచిస్తున్నారు.
దేశంలో యానిమేషన్ కోర్సులను వివిధ సంస్థలు అందిస్తున్నాయి. మంచి శిక్షణసంస్థను ఏ రకంగా ఎంచుకోవాలనేది విద్యార్థులకు తరచూ వచ్చే సందేహం. తాము చేరదల్చిన సంస్థల కార్యాలయాలకు వెళ్ళి అక్కడ విద్యార్ధులకు శిక్షణ ఏ రకంగా లభస్తోంది తెలుసుకోవాలి. సంస్థ గత చరిత్ర, మౌలిక సదుపాయాలు పరిశీలించాలి. ప్లేస్మెంట్లు స్థితిని తెలుసుకోవాలి. పూర్వ విద్యార్ధుల అభిప్రాయాలు సేకరించాలి. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న అనంతరం నిర్ణయం తీసుకోవటం మంచిది.
ఈ క్రింది లింక్లను నొక్కండి కొన్ని అద్బుతమైన యానిమేషనులను చూడండి.
comments please...............................ram sagi
ReplyDelete