శఠగోపనంతో ఫలితమేమిటి?
దేవాలయంలో
దర్శనం అయ్యాక తీర్థం, శఠగోపనం తప్పక తీసుకోవాలి. చాలా మంది దేవుడ్ని
దర్శనం చేసుకున్నాక వచ్చినన పనైపోయింది చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల
ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్ది మంది మాత్రమే ఆగి, శఠగోపనం
పెట్టించుకుంటారు.
శఠగోపనం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి
కూడా విన్పించనంతగా కోరకిను తలుసుకోవాలి. అంటే మీ కోరికే శఠగోపనం.
మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల
వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.
శఠగోపనం
తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం
శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్
బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి.
‘శ్రీ శఠారి’ భగవంతుని శ్రీ పాదముల స్వరూపం.శఠారి/నమ్మాళ్వారనే పరమ శ్రీ వైష్ణవ భక్తులు,12మంది ఆళ్వారులలో ప్రముఖులు.తమ అంతిమ సమయంలో ఆ పాదాన్నే(భగవంతుని) స్మరించడం వారే ఆ పాదాలక్రింద మారారని,ఆ భగవత్పాదాన్నే ఏ ఆలయంలోనైనా ‘శ్రీ శఠారి’ అనే అంటారు.నమ్మాళ్వారులనే ‘శఠగోపులని’కూడా అంటారు.
ReplyDeleteమీ Headerలో అహో!ఆంధ్రభోజా!శ్రీ కృష్ణదేవరాయా! గా సరిజేయండి.