Skip to main content

శఠగోపనంతో ఫలితమేమిటి?

శఠగోపనంతో ఫలితమేమిటి?


దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోపనం తప్పక తీసుకోవాలి. చాలా మంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చినన పనైపోయింది చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్ది మంది మాత్రమే ఆగి, శఠగోపనం పెట్టించుకుంటారు.
శఠగోపనం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరకిను తలుసుకోవాలి. అంటే మీ కోరికే శఠగోపనం. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.
శఠగోపనం తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్‌, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి.

Comments

  1. ‘శ్రీ శఠారి’ భగవంతుని శ్రీ పాదముల స్వరూపం.శఠారి/నమ్మాళ్వారనే పరమ శ్రీ వైష్ణవ భక్తులు,12మంది ఆళ్వారులలో ప్రముఖులు.తమ అంతిమ సమయంలో ఆ పాదాన్నే(భగవంతుని) స్మరించడం వారే ఆ పాదాలక్రింద మారారని,ఆ భగవత్పాదాన్నే ఏ ఆలయంలోనైనా ‘శ్రీ శఠారి’ అనే అంటారు.నమ్మాళ్వారులనే ‘శఠగోపులని’కూడా అంటారు.
    మీ Headerలో అహో!ఆంధ్రభోజా!శ్రీ కృష్ణదేవరాయా! గా సరిజేయండి.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఆదర్శ కుటుంబం లిరిక్స్

https://www.saavn.com/p/album/telugu/Aadarsa-Kutumbam-1969/JpW3TvCCtNI_ ఆదర్శ కుటుంబం

భక్త ప్రహ్లాద 1967 పాటల పుస్తకం

భక్త ప్రహ్లాద 1967 భక్త ప్రహ్లాద 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన  ప్రహ్లాదునిని  కథ ఆధారంగా వచ్చిన సినిమా. దీనికి మునుపు 1931, మరియు 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా  ఎస్.వి. రంగారావు ,  ప్రహ్లాదుడిగా రోజారమణి , ప్రహ్లాదుడి తల్లిగా  అంజలీ దేవి  నటించారు బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం మంచి పేరు తెచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు.

మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించండి ,గుడిని ,ఆ శిల్ప సౌందర్యాన్ని సృసించండి.

  మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించండి  ,గుడిని ,ఆ శిల్ప సౌందర్యాన్ని సృసించండి .ఈ క్రింది లింక్  ను నొక్కండి మీరు స్వయంగా గుడిని దర్శించిన అనుభూతిని పొందండి . http://www.view360.in/virtualtour/madurai/ ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటి పాత మదురై నగరపు జీవన విధానాన్ని కలిగి ఉంది. ఆలయ సముదాయం ముఖ్య దేవతలకు రెండు బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలు లేదా టవర్లకు నిలయంగా ఉంది, ఇవి అద్భుతమైన శిల్ప, చిత్రకళా రీతులతో ఉంది. ఆలయం తమిళ ప్రజలకు అతి ముఖ్యమైన చిహ్నంగా ఉంది, తమిళ సాహిత్యంలో అతి పురాతన కాలం నుంచీ ఈ ఆలయం ప్రస్తావించబడుతోంది, అయితే ఆలయ ప్రస్తుత రూపం 1600 సంవత్సరంలో నిర్మించబడిందని నమ్మిక.  హిందూ పురాణం ప్రకారం, శివుడు మీనాక్షిని [పార్వతి] పార్వతి అవతారాన్ని పెళ్లాడడానికి సుందరేశ్వర్ రూపంలో భూమ్మీదకు వచ్చాడు. మదుర పాలకుడు [మలయధ్వజ పాండ్య] చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతి ఒక చిన్న పాప రూపంలో భూమ్మీదికి వచ్చింది. పెరిగి పెద్దయిన తర్వాత ఆమె నగరాన్ని పాలించసాగింది. దేవుడు భూ మ్మీద అవతరించి ఆమెను పెళ్లాడతానని వాగ్దానం చేశాడు. ఆ పెళ్లి భూమ్మీద అ...