Skip to main content

అజంతా,ఎల్లోరా అందాలను స్వయంగా చూసిన అనుభూతిని పొందండి.


 అజంతా,ఎల్లోరా  అందాలను స్వయంగా చూసిన అనుభూతిని పొందండి.


 కనులు తిప్పుకోనీయని అందాలు అజంతా సొంతం. అజంతా, ఎల్లోరా గుహలు భారతీయ శిల్పకళలకు తార్కాణం. హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పకళారీతులు ఒకే చోట కనువిందు చేస్తాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఘృష్ణేశ్వరుడు ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు. అజంతా ఎల్లోరా గుహల అందాలను, అక్కడి శిల్పసౌందర్యాన్ని ఓసారి పరికిద్దాం.
ఔరంగాబాద్‌కు 107 కిలోమీటర్ల దూరంలో అజంతా గుహలు ఉన్నాయి. 56 మీటర్ల ఎత్తులోని పర్వతాలమీద ఈ గుహలు పడమర నుంచి తూర్పునకు వ్యాపించి ఉంటాయి. 1819లో జాన్‌స్మిత్‌ అనే బ్రిటీషు అధికారి వీటిని గుర్తించాడు. ఇక్కడ మొత్తం 29 గుహలుంటాయి. ఆయన ఈ గుహలను ఎక్కడి నుంచైతే చూశాడో ఆ ప్రదేశాన్ని వ్యూ పాయింటుగా చెప్తారు. అక్కడి నుంచి ఈ గుహలకు గల దారి గుర్రపు నాడాలా సన్నగా కనిపిస్తుంది. చుట్టుపక్కల పరిసరాలు, అక్కడి జలపాతాలు ఎంతో అందంగా ఉంటాయి.
పెయింటింగులతో నిండి ఉండే ఈ గుహలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తాయి. గుహల పైకప్పు, పక్కభాగాలలో బుద్ధుని జీవిత విషయాలను చిత్రీకరించారు. గోడలపై బుద్ధుని జీవిత విషయాలను వర్ణించే చిత్రాలు ఉంటాయి. ఈ చావడికి ఎడమవైపున ఉన్న హాలులో వేటగాడు పన్నిన వలనుంచి పావురాన్ని రక్షిస్తున్న శిబిచక్రవర్తి చిత్రం, జాతక కథలు ఉన్నాయి.
రెండో గుహలో బుద్ధుని పుట్టుకను చిత్రించారు. దాని పైకప్పు మీద హంసలు బారులు తీరిన దృశ్యం ఎంతో బాగుంటుంది. ఇంకా అప్పట్లో వారు వాడిన మఫ్లర్లు, పర్సులు, చెప్పులు వంటి వాటిని కూడా చిత్రించారు. 16వ నెంబరు గుహలో బుద్ధుని జీవితంలో ఎదురైన అనేక సంఘటనలను మనం చూడొచ్చు. క్రీస్తు పూర్వం 2-7 శతాబ్దాల మధ్య కాలంలో వీటిని చిత్రీకరించినట్టు చారిత్రక ఆధారాలు చెపుతున్నాయి. అప్పుడు వేసిన చిత్రాలకు గల రంగులు ఇప్పటికీ ఉండడం చిత్రంగానే ఉంటుంది.
ఎల్లోరా గుహలు
ఎల్లోరా గుహలను రాష్ట్రకూటులు, చాళుక్యుల కాలంలో చెక్కారట. ఔరంగాబాద్‌కు వాయవ్యంగా 61 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కొండలను తొలిచి ఇంత చక్కటి అందాలను మన కోసమే తీర్చిదిద్దారా అని అనిపిస్తాయి. వీటి నిర్మాణంలో ఒక విశిష్టత ఉంది. మొదట పై అంతస్తు, అందులోని శిల్పాలను చెక్కి ఆ తరువాత కింది అంతస్తు, అక్కడి శిల్పాలు చెక్కారట. ఇక్కడ మొత్తం 34 గుహలుంటాయి.
సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఈ గుహల అందాలు దృష్టిని మరల్చనీయవు. మొదట బౌద్ధులకు సంబంధించిన 12 గుహలు ఉంటాయి. వీటిని 5-8 శతాబ్దాల మధ్య కాలంలో చెక్కారు. 6-9 శతాబ్ద కాలంలో చెక్కినవి హిందువుల గుహలు. అవి మొత్తం 17 గుహలు. చివర్లో జైనుల గుహలుంటాయి. ఇవి 8-10 శతాబ్దాల మధ్య కాలంలో చెక్కినవి. వీటిని హెరిటేజ్‌ సైట్లుగా కూడా గుర్తించింది. ఈ క్రింది లింకును నొక్కి అజంతా ఎల్లోరా అందాలను స్వయంగా చూసిన అనుభూతిని పొందండి .ఇంకెందుకు ఆలస్యం చూద్దాం పదండి.
 ఈ క్రింది లింకును నొక్కండి .

                   http://view360.in/ajanta/

 

Comments

Popular posts from this blog

భక్త ప్రహ్లాద 1967 పాటల పుస్తకం

భక్త ప్రహ్లాద 1967 భక్త ప్రహ్లాద 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన  ప్రహ్లాదునిని  కథ ఆధారంగా వచ్చిన సినిమా. దీనికి మునుపు 1931, మరియు 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా  ఎస్.వి. రంగారావు ,  ప్రహ్లాదుడిగా రోజారమణి , ప్రహ్లాదుడి తల్లిగా  అంజలీ దేవి  నటించారు బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం మంచి పేరు తెచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు.

కమ్మ,రెడ్డి,కాపు ఒకే కులం

కమ్మ,వెలమ,రెడ్డి,కాపు,ఒకే కులం   మధ్య యుగములో గ్రామాధికారిగా వ్యవహరించే కాపును రెడ్డి అని గౌరవపూర్వకముగా సంబోధించేవారు. ప్రముఖ బ్రిటిష్ సామాజిక శాస్త్రజ్ఞుడు ఎడ్గార్ థర్ స్టన్ 'రెడ్డి' అను బిరుదు కలవారిని 'కాపు' కులంలో భాగంగా పేర్కొన్నాడు కాపులు రెడ్లు వేరువేరు కులాలు వారుకాదు.వారిద్దరూ ఒకేకులస్తులు.రెడ్లు ఇప్పటికీ తమకులం కాపు అని పేర్కొంటారు అని చేగొండి హరిరామ జోగయ్య సమాచార శాఖా మంత్రిగా ఉన్నరోజుల్లో అన్నారు."నిజాం రాజ్యంలో కులాలు తెగలు" అనే గ్రంధంలో(1920) సయ్యద్ సిరాజుల్ హసన్ కాపుల గురించి వివరంగా రాశారు:కాపు,కుంబి,రెడ్డి-ద్రావిడ జాతికి చెందిన వ్యవసాయదారుల కులం.ఆదిరెడ్డికి పుట్టిన ఏడుగురు కొడుకులలోంచి పుట్టిన కాపులు 10 ఉప కులాలుగా విడిపోయారు.1.పంచరెడ్లు(మోటాటి,గోదాటి,పాకనాటి,గిట్టాపు,గోనెగండ్లు) 2.యాయ 3.కమ్మ 4.పత్తి 5.పడకంటి 6.శాఖమారి 7.వక్లిగర్ లింగాయతు 8.రెడ్డి 9.పెంట 10.వెలమ.మోటాటి రెడ్లు మోటాటి కాపుల ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకుంటారు.చిట్టాపుకాపులు మాసం మద్యం ముట్టరు.గోడాటికాపుస్త్రీలు పైట కుడివైపుకు వేస్తారు.వారిలో వితంతువివాహాలున...

ఆదర్శ కుటుంబం లిరిక్స్

https://www.saavn.com/p/album/telugu/Aadarsa-Kutumbam-1969/JpW3TvCCtNI_ ఆదర్శ కుటుంబం