పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తోన్న చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఇప్పటికే క్రేజ్ కావాల్సినంత వచ్చేసింది. దీన్ని బాలీవుడ్ కూడా గమనించింది. అందుకే రాంబాబు రైట్స్ కోసం సల్మాన్‌ఖాన్ పోటీపడుతున్నట్లు తెలిసింది.
దబాంగ్ సినిమాను పవన్ చేశాడు. అందులో ఖైదీలతో పారడీ చేసి హిట్ కొట్టేశాడు. ఆ ప్యారడీ దబాంగ్-2లో వాడేస్తున్నారు. ఇదిలా ఉంటే... అమితాబ్‌తో సినిమా తీసిన పూరీ స్టామినాను తెలుసుకుని పూరీతో సల్మాన్ కాంటాక్ట్‌లో ఉన్నట్లు తెలిసింది.
కానీ మరో ఇద్దరు హీరోలు కూడా ఈ చిత్రం కోసం పోటీపడుతున్నట్లు సమాచారం. అజయ్‌దేవగన్, అక్షయ్‌కుమార్‌లు కూడా రాంబాబు సినిమాపై మోజుపడినట్లు తెలిసింది. మరి ఈ ముగ్గురిలో ఫైనల్‌గా రాంబాబు చిత్రం ఎవరిని వరిస్తుందో చూడాలి.
Comments
Post a Comment