భూమి వాతావరణంలో సూర్యుడి కిరణాలు మన కంటికి చేరేంతదాకా అవి ప్రయాణించే దూరాలు మారుతూ ఉంటాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్య కిరణాలు మన కంటికి చేరేందుకు ఎక్కువ దూరం ప్రయాణించాలి. దూరంగా భూమి, ఆకాశం కలసినట్లు కనిపించే క్షితిజ రేఖకు దగ్గరగా సూర్యుడు ఉదయించే, అస్తమించే సమయాల్లో దగ్గరగా ఉండటం వల్లనే సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు.
అదే మధ్యాహ్న సమయాల్లో సూర్యుడు మన నడినెత్తిపైన ఉన్నప్పుడు కిరణాలు తక్కువ దూరంపాటు ప్రయాణించి మన కంటిని చేరుతాయి. అలాంటి సమయాల్లో సూర్యుడి రంగు మామూలుగానే ఉంటుంది. అయితే... వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తూ, తక్కువగా చెదిరిపోయే ఎరుపు రంగు మన కంటికి ఎక్కువగా చేరుకోవడం వల్ల... సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు ఎర్రగా కనిపిస్తాడు.
భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన సూర్య గ్రహణము ఏర్పడుతుంది. సూర్య గ్రహణము అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచకముగా భావించేవారు. ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల ప్రజలు వీటిని అశుభ సూచకంగానే భావిస్తారు. అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశం నుండి మాయమై చీకటి కమ్ముకోవడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతారు. విజ్ఞాన శాస్త్రం గ్రహణాలను వివరించిన తరువాత ప్రజల్లో ఇటువంటి నమ్మకాలు తగ్గాయి.
అద్భుతమైన చిత్రాలతో కూడిన మంచి సమాచారము.
ReplyDelete