Skip to main content

పేరడీల "సుడిగాడు" ......సుడిగాడు చిత్రసమీక్ష .


పేరడీల  "సుడిగాడు" ......సుడిగాడు చిత్రసమీక్ష . 
ఈ జెనరేషన్ లో కామెడీ చిత్రాలకు అల్లరి నరేష్ కేరాఫ్ అడ్రాస్ గా మారాడు. అతనికి ఒకప్పుడు శుభాకాంక్షలు ,సుస్వాగతం వంటి వరస హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టున్న దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు జత కలిసాడు. ఇద్దరి కాంబినేషన్ లో సుడిగాడు సినిమా రూపుదిద్దుకుంది. కరెంటు తీగ కూడా నాలా సన్నగా ఉంటుంది. ముట్టుకొంటే షాకే...' అని హీరో అంటే.. 'మరి కరెంటు పోతేనో...' అంటూ కౌంటర్ వస్తే నవ్వుతాం... అలాంటి స్టార్ హీరోల డైలాగుల సెటైర్లలతో, గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రాల ప్యారెడీలతో, మంచి ఓపినింగ్స్ తో అల్లరి నరేష్ తాజా చిత్రం ‘సుడిగాడు'థియేటర్లలలో దిగింది. సాధారణంగా అల్లరి నరేష్ చిత్రాలు అంటే హిట్ సినిమాల ప్యారెడీలు కథలో కలిసిపోయి అప్పుడప్పుడూ వచ్చి నవ్విస్తూంటాయి. అలాంటిది పూర్తిగా ప్రతీ సీనూ ప్యారడీలతో రూపొందితే ఎలా .... . ట్రైలర్స్ ద్వారా, పోస్టర్స్ ద్వారా విపరీతమైన ఆసక్తి రేపిన ఈ చిత్రం థియేటర్లలోనూ ఏ మాత్రం తగ్గకుండా నవ్వులు పూయించి టిక్కెట్ డబ్బుకు న్యాయం చేసేసింది.ఇక దీనికి ఒక టికెట్ పై సినిమాలు అంటూ ప్రచారాన్ని ఊదరకొట్టారు. దీంతో అందరి దృష్టి సుడిగాడు సినిమా మీద పడింది. ఈ సుడిగాడు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి సుడిగాడు సంగతేంటో చూద్దాం పదండి .............
 
కథ : సుడిగాడు చిత్ర కథ చెప్పాలంటే కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే ముందు నుంచి చిత్ర యూనిట్ చెబుతున్నట్లు ఈ సినిమా కలగురగంపలా నడుస్తోంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒకొక్కసారి కేవలం స్నూఫ్ ల కోసమే ఈ సినిమా తీసారనిపిస్తుంది. సినిమా ఎంత సేపు ఆ కోణంలోనే సాగుతుంది. ఇక చిత్రకథ గురించి చెప్పుకోవాలంటే.. ఇందులో హీరో అమ్మ కడుపు లో నుంచే సిక్స్ ప్యాక్ తో బయటకి వస్తాడుఈది మరీ  విచిత్రం . అంత చిన్న వయస్సు లోనే విలన్ గ్యాంగ్ మనుషులను  చంపుతాడు ( ఎలా చంపుతాడు DIRECTOR ని అడగాలి ). దీంతో విలన్ గ్యాంగ్ హీరో గురించి వెతుకుతూంటుంది. అఖరికి ఆ విలన్ గ్యాంగ్ ను ఎలా చంపుతాడనేది చిత్రకథ(రొటీన్  తెలుగు కథ ). హీరో గారు ప్రేమలో పడటం.. ఆ ప్రేమను ఎలా గెలిపించుకున్నాడన్నది ఉపకథ.
                                                        నటీనటుల విషయానికి వస్తే అల్లరి నరేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్ర ఇచ్చినా పండించే సత్తా ఉన్న నటుడు. ఇక తనకు అలవాటైన కామెడీ హీరో పాత్ర ఇస్తే ఊరుకుంటాడా.. చింపి అవతల పారేస్తాడు. ఈ సినిమాలోనూ అదే చేసాడు. కామెడీ, డాన్సులుతో పాటు ఈ సినిమాలో ఫైట్లు కూడా బాగా చేశాడు. ఇక మోనాల్ గుజ్జార్ విషయానికి వస్తే తన వరకూ బానే చేసింది. హీరోయిన్ కు పెద్దగా ప్రాముఖ్యత లేని సినిమా ఇది. బ్రహ్మనందం నవ్వులు పంచాడు(ఎప్పటిలాగే ). కోవై సరళ పర్వాలేదు . మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు కోడా పర్వాలేదు  , ఫోటో గ్రఫీ, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. కామెడీ సినిమాలో ఇంత కంటే గొప్ప మాటలను ఆశించలేం కదా మరి . నిర్మాతలు సినిమా బాగా రావడానికి తమ వంతు కృషి చేశారు. ఇక దర్శకత్వం విషయానికి వస్తే వరస సూపర్ హిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భీమినేని శ్రీనివాసరావు చాలా కాలం విరామం తరువాత ఈ సుడిగాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఆయన తన ప్రతిభను నమ్ముకోకుండా అల్లరి నరేష్ మీద ఆధారపడినట్లు అనిపిస్తోంది. అలాగే ఈ సినిమాను స్నూఫ్ ల ప్రధానంగా సాగించాలని ఆయన ఎక్కువ కష్టపడ్డారు. దానికి కంటే ఒక మంచి కథ తయారు చేసుకోవడానికి ఆయన శ్రమపడితే బాగుండేదేమో . సినిమాలో ప్రారంభం లో సన్నివేశాలు కొంచెం ఓవరగా  అనిపిస్తాయి. అలాగే రియాల్టీ షో ల మీద సాగిన పేరడీ సీన్ బాగాలేదు .ఏదైమైనా ఇవివి సత్యనారాయణ వంటి దర్శకులు గతంలో ఇంతకన్నా గొప్పగా ప్యారెడీ లు చేసి నవ్వించినా భీమినేని శ్రీనివాసరావు లాగ పూర్తి ప్యారెడీలతో సినిమా ఎవరూ తీయలేదు. కాబట్టి... ఈ కొత్త ప్రయోగాన్ని ఓసారి చూసి నవ్వుకోవచ్చు. ప్రోమోలు, పోస్టర్స్ చూసి మరీ ఏదో అద్బుతం చూడబోతున్నాం... అని ఫిక్స్ . అయి సినిమాకు వెళ్లకపోతే మంచి టైం పాస్ వ్యవహారమే... 

ఫైనల్ గా ‘సుడిగాడు'కి సుడి ఉంది............రేటింగ్ ఎందుకుకాని  ఒక్క సారి మాత్రం చూడోచ్చు హాయిగా నవ్వుకోవచ్చు .
ఏంటి రేటింగ్ కావాల ! సరే అయితే 
నా రేటింగ్ :2.75/5

Comments

Post a Comment

Popular posts from this blog

భక్త ప్రహ్లాద 1967 పాటల పుస్తకం

భక్త ప్రహ్లాద 1967 భక్త ప్రహ్లాద 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన  ప్రహ్లాదునిని  కథ ఆధారంగా వచ్చిన సినిమా. దీనికి మునుపు 1931, మరియు 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా  ఎస్.వి. రంగారావు ,  ప్రహ్లాదుడిగా రోజారమణి , ప్రహ్లాదుడి తల్లిగా  అంజలీ దేవి  నటించారు బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం మంచి పేరు తెచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు.

కమ్మ,రెడ్డి,కాపు ఒకే కులం

కమ్మ,వెలమ,రెడ్డి,కాపు,ఒకే కులం   మధ్య యుగములో గ్రామాధికారిగా వ్యవహరించే కాపును రెడ్డి అని గౌరవపూర్వకముగా సంబోధించేవారు. ప్రముఖ బ్రిటిష్ సామాజిక శాస్త్రజ్ఞుడు ఎడ్గార్ థర్ స్టన్ 'రెడ్డి' అను బిరుదు కలవారిని 'కాపు' కులంలో భాగంగా పేర్కొన్నాడు కాపులు రెడ్లు వేరువేరు కులాలు వారుకాదు.వారిద్దరూ ఒకేకులస్తులు.రెడ్లు ఇప్పటికీ తమకులం కాపు అని పేర్కొంటారు అని చేగొండి హరిరామ జోగయ్య సమాచార శాఖా మంత్రిగా ఉన్నరోజుల్లో అన్నారు."నిజాం రాజ్యంలో కులాలు తెగలు" అనే గ్రంధంలో(1920) సయ్యద్ సిరాజుల్ హసన్ కాపుల గురించి వివరంగా రాశారు:కాపు,కుంబి,రెడ్డి-ద్రావిడ జాతికి చెందిన వ్యవసాయదారుల కులం.ఆదిరెడ్డికి పుట్టిన ఏడుగురు కొడుకులలోంచి పుట్టిన కాపులు 10 ఉప కులాలుగా విడిపోయారు.1.పంచరెడ్లు(మోటాటి,గోదాటి,పాకనాటి,గిట్టాపు,గోనెగండ్లు) 2.యాయ 3.కమ్మ 4.పత్తి 5.పడకంటి 6.శాఖమారి 7.వక్లిగర్ లింగాయతు 8.రెడ్డి 9.పెంట 10.వెలమ.మోటాటి రెడ్లు మోటాటి కాపుల ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకుంటారు.చిట్టాపుకాపులు మాసం మద్యం ముట్టరు.గోడాటికాపుస్త్రీలు పైట కుడివైపుకు వేస్తారు.వారిలో వితంతువివాహాలున...

ఆదర్శ కుటుంబం లిరిక్స్

https://www.saavn.com/p/album/telugu/Aadarsa-Kutumbam-1969/JpW3TvCCtNI_ ఆదర్శ కుటుంబం