Skip to main content

జుట్టుకు ఎంతో బలమైన అద్బుతమైన తైలం

జుట్టుకు ఎంతో బలమైన అద్బుతమైన తైలం.

జుట్టు కు సంబంధించి ఎన్నో సమస్యలు. తలలో చుండ్రు, జుట్టు రాలడం, పేను కొరుకుడు, చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం.. ఇలా ఏన్నో సమస్యలు ఆడా మగా అనే తేడా లేకుండా వేధిస్తుంటాయి. వీటిని ఎదుర్కొని శిరోజాల పెరుగుదలకు ఉపయోగపడే మంచి తైలం ఉందని ఆయుర్వేదం తెలియజేస్తోంది. ఈ తైలాన్ని ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. ఎలాగ చేయ్యాలోచూద్దామా ........ .


తైలం తయారీకి కావల్సినవి: పావుకిలో చొప్పున గుంటగలగరాకు, ఉసిరికాయలు, 200 గ్రాముల మందారపూలు, ఒక చెంచా అతిమధురం, కొబ్బరినూనె, తగినన్ని నీళ్లు
తయారుచేసే విధానం: ముందుగా గుంటగలగరాకు, ఉసిరికాయలు, మందార పువ్వులను దంచి ఆ ముద్దను మందపాటి అడుగుకల ఓ వెడల్పాటి పాత్రలో వేయాలి. ఆ తర్వాత అందులో నీళ్లు పోసి గరిటతో కలబెడుతూ బాగా మరగేవరకూ వేడిచేయాలి. పాత్రలోని ద్రవం బాగా మరిగి సుమారు నాలుగోవంతు వచ్చిన తర్వాత కొబ్బరినూనెను పోసి సన్నని సెగపై మళ్లీ వేడి చేయాలి. 
కొంతసేపటికి నీరు పూర్తిగా ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలి పైకి తేలుతుంది. దీనిని బాగా చల్లార్చాలి. ఆ తర్వాత నూనెను దళసరి వస్త్రం ద్వారా మరోపాత్రలోకి వడకట్టాలి. అంతే.. మీకు కావలసిన తైలం సిద్ధమైనట్లే. ఈ తైలం సుమారు ఏడాది వరకూ నిల్వ ఉంటుంది.
ఈ తైలంతో మర్దన చేస్తే... తలనొప్పి, పార్వ్శపు నొప్పి, ఒత్తిడితో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిద్రలేమికి కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
 జుట్టుకు రోజు పట్టించి చూడండి అద్బుతమైన ఫలితాలు  పొందండి .

Comments

Popular posts from this blog

ఆదర్శ కుటుంబం లిరిక్స్

https://www.saavn.com/p/album/telugu/Aadarsa-Kutumbam-1969/JpW3TvCCtNI_ ఆదర్శ కుటుంబం

భక్త ప్రహ్లాద 1967 పాటల పుస్తకం

భక్త ప్రహ్లాద 1967 భక్త ప్రహ్లాద 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన  ప్రహ్లాదునిని  కథ ఆధారంగా వచ్చిన సినిమా. దీనికి మునుపు 1931, మరియు 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా  ఎస్.వి. రంగారావు ,  ప్రహ్లాదుడిగా రోజారమణి , ప్రహ్లాదుడి తల్లిగా  అంజలీ దేవి  నటించారు బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం మంచి పేరు తెచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు.

ఇంటిగుట్టు పాటల పుస్తకం1958

ఇంటిగుట్టు