మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి
పుట్టినతేది: 22 ఆగష్టు 1955
పుట్టినతేది: 22 ఆగష్టు 1955
ఇతరపేర్లు: కొణిదల శివశంకర వరప్రసాద్,మెగాస్టార్,సుప్రీమ్ హీరో
తండ్రిపేరు: కొణిదల వెంకట్రావ్
తల్లిపేరు: శ్రీమతి అంజనా దేవి
భార్యపేరు: శ్రీమతి సురేఖ
కుమారులు: రామ్ చరణ్ తేజ్
కుమార్తెలు: శ్రీమతి సుష్మిత , శ్రీమతి శ్రీజా
అశేష ఆంధ్ర సినిమా అభిమానుల గుండెల్లో మెగాస్టార్ గా కొలువుదీరిన చిరంజీవి జీవనయాత్ర పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు నుంచి మొదలైంది. తండ్రి గారిది పెనుగొండ అయిన అమ్మగారి ఇంట్లోనే ఉండేవారు. చిరంజీవి చదువు నిడదవోలులో ఓనమాలు దిద్దుకుని గురజాల, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, మొగల్తురులలో ప్రాధమిక విద్య పూర్తయ్యింది. ఇంటర్ మీడియట్ ఒంగోలు లోను , డిగ్రీ నర్సాపూర్ వై.యన్. కాలేజీ లో పూర్తి చేసారు. కాలేజీ రోజుల్లో నటనమీద ఏర్పడ్డ మమకారాన్ని నిజంచేసుకోవడానికి మద్రాసులో ఫిలింఇన్స్టిట్యుట్ లో చేరి నటనలో శిక్షణ తీసుకున్నారు. 1978 లో శిక్షణాకాలం పూర్తవుతున్న సమయంలో 'పునాది రాళ్ళు' సినిమాలో నటించే ఆవకాశం రావటంతో చిరంజీవి సినీ ప్రస్థానం మొదలయింది. తరవాత వచ్చిన ఏ చిన్నఅవకాశాన్ని వదలకుండా వినియోగించుకుని ఆనతికాలంలోనే మంచి నటుడిగా, మంచి డాన్సుర్ గా పేరుగడించారు. మొదట ప్రతినాయక పాత్రలలో నటించినా తరవాత హీరో గా రాణించడం మొదలయింది. 1983 లో విడుదల అయిన 'ఖైది ' తెలుగు సినిమా పరిశ్రమకు ఓ పెద్ద స్టార్ నీ ప్రసాదించింది. అదిరిపోయే డాన్సు లుతో , ఫైట్ లతో వచ్చిన మాస్ ఫాలోయింగ్ తో సుప్రీంహీరోగా తరవాత మెగా స్టార్ గా కోటానుకోట్ల అభిమానులను సంపాయించుకుని స్టార్ ఇమేజ్ కు కొత్త నిర్వచనం చెప్పారు అయన. తరవాత తెలుగు సినిమాలో స్టార్ హీరో గా నిలదొక్కుకోవాలంటే డాన్సు చేయడం, ఫైట్స్ చేయడం అనేవి ప్రధాన అర్హతలు అయ్యాయి. ఇప్పటికి అదే భావనలో తెలుగు ప్రేక్షకులు ఉండటం చూస్తుంటే చిరంజీవి ఎంతలా ప్రభావితం చేసారో ఊహించవచ్చు.

శివుడి పాత్రకి చిరంజీవి అతికినట్టు సరిపోతారు. శివుడు శివుడు శివుడు, ఆపద్భాందవుడు, మంజునాథ చిత్రాలలో చిరంజీవిని శివుడు గా చూడొచ్చు.
- నాట్యానికి చిరంజీవి పెట్టింది పేరు. నాట్యం లో బహుముఖ ప్రజ్ఞాశాలి గా తెలుగు చలన చిత్ర రంగం లో ఒక నూతన శకానికి తెర తీశాడనటం లో అతిశయోక్తి లేదు.
- ప్రారంభ దశలో సహ నటుడు గా, నెగటివ్ పాత్ర లతో, విలన్ గా, కొంత నిలదొక్కుకున్న తర్వాత కుటుంబ చిత్రాల పాత్రలతో, రౌద్రం, ప్రతాపం ఉట్టిపడే పాత్రలతో, పిమ్మట అడపాదడపా హాస్య భరిత చిత్రాలతో, అటు సాంఘిక, ఇటు పౌరాణిక పాత్రలతో నటుడుగా చిరంజీవి పరిపూర్ణతని సంతరించుకొన్నాడు.
- తన కన్నడ అభిమానులను ఉత్తేజ పరచటానికి చిరు కొండకచో చిన్న చిన్న కన్నడ పదాలని ఉచ్ఛరిస్తూ ఉంటాడు. జగదేకవీరుడు అతిలోకసుందరి లో, జూదగాడి (తనికెళ్ళ భరణి) చేతిలో మోసపోయిన "గుండప్ప" అనే కన్నడిగ పాత్రకి అదే జూదంలో తిరిగి డబ్బుని సంపాదించి అతనికి మేలు చేస్తాడు. అతనితో "బన్నిరి సార్, బన్నిరి" (రండి సార్, రండి) అంటాడు. శంకర్ దాదా MBBS లో ఒక పాటలో కన్నడిగ యువతి "నిన్న హెసరేనప్పా?" (నీ పేరేంటయ్యా?) అని అడిగిన ప్రశ్నకి "నన్న హెసరా? శంకర్ దాదా MBBS" (నా పేరా? శంకర్ దాదా MBBS) అని జవాబిస్తాడు. శంకర్ దాదా జిందాబాద్ లో ఒక పాటలో "స్టార్ట్ మాడిత్తిని, కేళిత్తియా?" (స్టార్ట్ చేస్తాను, వింటావా?) అని అంటాడు. బళ్ళారి లో చిరు కి విపరీతమయిన జనాదరణ ఉంది అని ఒక వినికిడి.
- రఫ్ ఆడించేస్తా, బాక్సు బద్దలౌద్ది, అంతొద్దు, ఇది చాలు వంటి ఇతని సినిమాల్లో సంభాషణలని తెలుగు ప్రజలు రోజూవారీ సంభాషణలుగా వాడటం, సమాజం పై చిరు చూపించిన ప్రభావానికి నిదర్శనం.
- చిరంజీవి డాన్సులకే కాకుండా ఫైట్స్ కు కూడా పెట్టింది పేరు.ఆయన ఫైట్స్ శైలి కూడా ప్రత్యేకంగా ఉంటుంది.డూప్ లేకుండానే రిస్క్ తీసుకుంటారు.
- చిరు గుర్రపు స్వారీ శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక చేత్తో మాత్రమే కళ్ళాన్ని పట్టుకొని, మరొక చేయిని గాలిలో వదిలేసి, గుర్రం పైన పూర్తిగా కూర్చోకుండా కొద్దిగా నిలబడి చిరు చేసే స్వారీ కంటికి ఇంపు గా ఉంటుంది. అంజి, కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి చిత్రాల్లో ఈ శైలి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
- మంజునాథ, సిపాయి చిత్రాలు మొదట కన్నడంలో నిర్మించబడినవి. అక్కడ విజయవంతమయిన పిమ్మట తెలుగులోకి అనువదించబడినవి.
- రజినీ కాంత్ కథానాయకుడుగా గీతా ఆర్ట్స్ బ్యానరు పై మాప్పిళ్ళై చిత్రాన్ని నిర్మించాడు. దీనికిఅత్తకి యముడు అమ్మాయికి మొగుడు మాతృక. ఇందులో చిరు అతిథి పాత్రలో కనిపిస్తారు.
- గ్యాంగ్ లీడర్ హిందీ పునర్నిర్మాణం ఆజ్ కా గూండారాజ్ లో, అంకుశం హిందీ పునర్నిర్మాణం ప్రతిబంద్ లో, దక్షిణాదిన విజయవంతమయిన జెంటిల్ మేన్ హిందీ పునర్నిర్మాణం ది జెంటిల్ మేన్ లో కూడా కథానాయకుడు గా నటించాడు. ఘరానా మొగుడు మలయాళంలోకి హేయ్ హీరో గా అనువదించబడినది.
- పశ్చిమ ఐరోపా ఖండం, ల్యాటిన్ అమెరికా లలో సైతం చిరు పేరొందాడు. దొంగ చిత్రంలో గోలి మార్ పాటకి మైఖేల్ జాక్సన్ రూపొందంచిన థ్రిల్లర్ ఆల్బం మూలం. ఈ పాటల్లో చిరు మరియు జాక్సన్ నాట్య భంగిమలు, వేషధారణలలో చాలా సామ్యం కనబడుతుంది. అందుకే ఈ దేశాలలో చిరుని ఇండియన్ జాక్సన్ గా వ్యవహరిస్తారు.కొదమ సింహం చిత్రం ఆగ్లంలొ తీఫ్ ఆఫ్ బాగ్దాద్గా అనువాదం గావించబడి నార్త్ అమెరికా,మెక్సికొ,ఇరాన్ మరియు ఇతర దేశాలలో విజయవంతంగా ప్రదర్శింపబడినది
చిరంజీవి
సినీజీవితం 'పునాది రాళ్ళు'తో మొదలై ఖైది, అభిలాష, చాలంజ్, మంచిదొంగ,
కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఇంద్ర వంటి సూపర్
డూపర్ హిట్ లతో ఇప్పటి వరుకు 149 చిత్రాలకు పని చేసారు. గ్యాంగ్ లీడర్
హిట్ తరవాత దేశంలోని పెద్ద న్యూస్ మ్యాగ్ జైన ది వీక్ చిరంజీవిని 'సరికొత్త
మనీమిషన్ ' గా అభివర్ణించడం అతిశయోక్తి కాదు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్
నిర్మించి తోలి ప్రయత్నంగా 'రుద్రవీణ' అనే సామజిక స్పృహ కలిగిన సినిమాను
నిర్మించి జాతీయ అవార్డు ను సొంతం చేసుకున్నారు. చిరంజీవి చారిటబుల్
ట్రస్ట్ స్థాపించి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ద్వారా సామాన్య ప్రజలకు
సేవలను అందిస్తున్నారు. 2008 లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయ
రంగప్రవేశం చేసి తిరుపతి నియోజకవర్గం నుండి శాసనసభకు యం.యల్.ఏ. గా
ఎన్నికయ్యారు.ఆ తరువాత రాజ్యసభకు నామినేట్ అయ్యారు .
త్వరలోనే తన 150వ చిత్రాన్ని ప్రకటిస్తాడని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు .తెలుగు చిత్రసీమలో తిరుగులేని 'మెగాస్టార్' అనిపించుకున్న చిరంజీవి రాజకీయాలలో కూడా మెగాస్టార్ (ముఖ్యమంత్రి ) అవ్వాలని వారి అభిమానుల ఆశ .జీవితంలో క్రింది స్తాయి నుంచి ఎదిగిన చిరంజీవి మరింత ఉన్నత స్తితికి చేరాలని ఆశిస్తూ వారికివే నా జన్మదిన శుభాకాంక్షలు .
Comments
Post a Comment