'జులాయి' టాక్ ఏంటి? అల్లు అర్జున్, ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొంది ఈ రోజు విడుదల అయిన రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పోషించిన రవి పాత్ర తనదైన శైలిలో కొత్తగా ప్రయత్నించి మార్కులు కొట్టేసాడు.
స్టైలిష్ స్టార్ అన్నపదానికి న్యాయం చేసే విధంగా డాన్స్ లు,ఫైట్స్
ఇరగతీసాడు.ఇలియానా ..మధు పాత్రలో జల్సా మ్యాజిక్ ని రిపీట్ చేయటానికి ప్రయత్నించింది.
ఇంటర్వెల్ సీన్ దగ్గరలో ఆమె చేసిన నటన చాలా బాగుంది. ఆమె హైటెక్ ఇంజినీర్
గా ఈ సినిమాలో కనిపిస్తుంది. సమాజం పట్ల భాద్యత కల పాత్రలో ఆమె
మరిపిస్తుంది.
ఖలేజాతో నిరాసపరిచిన త్రివిక్రమ్ ఈ సినిమాతో ఫుల్ మీల్స్ తినిపించాడు.
టెక్నికల్ గా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించారు. నిర్మాణ
విలువలు బాగున్నాయి. ముఖ్యంగా ఎప్పటిలాగే త్రివిక్రమ్ మార్క్ వన్
లైనర్స్,పంచ్ డైలాగులు పేలాయి. త్రివిక్రమ్ సినిమా అనగానే అంతా ముందుగా చూసేది డైలాగుల కోసమే. అతని పంచ్ ల కోసమే.
కొన్ని పంచ్ లు
1. పొద్దునే లేవచ్చు కదరా అని తండ్రి అంటే.. ‘‘కోడి కూడా పొద్దున్నే
లేస్తుంది. ఏం సాధించింది? కూరొండుకుని తినేస్తున్నాం’’ అన్నది సమాధానం.
2. ‘‘అంతేసార్. లాజిక్కులు తీస్తే నమ్మరు. మ్యాజిక్
చేస్తేనే నమ్ముతారు. అందుకే మన దగ్గర సైంటిస్టుల కంటే బాబాలు ఫ్యామస్’
అంటాడు.
3.‘‘అమ్మాయిని దేవతలా చూసుకుంటాం బాబూ’’ అంటే.. ‘‘నైవేద్యం చూపించి, ప్రసాదాలు మీరు మింగేద్దామనా’’
4. ‘‘నీకే ఇంత తలనొప్పి తెస్తున్నాడంటే వాడెవడో అమృతాంజనంకి అమ్మామొగుడయ్యుంటాడు’’
5. ‘‘అలా చేయకపోతే మోటార్ సైకిల్లో మోటార్ తీసేసి సైకిల్ మాత్రమే నాకిస్తానన్నాడు మేడం’’
‘‘దాన్ని చూడండి. కరవొచ్చిన కంట్రీకి అంబాసిడర్ లా ఎలా తయారైందో’’
ఇవి మచ్చుకు కొన్నే. ఇలాంటి డైలాగులు ‘జులాయి’ నిండా బోలెడున్నాయి. అంతకు అద్భుతమైన టైమింగ్ తో, నటనతో నవ్వించే క్యారెక్టర్లున్నాయి. త్రివిక్రమ్ పెన్ పవర్, అతనిలో సెన్సాఫ్ హ్యూమర్ ఏమైనా తగ్గాయేమో అని అనుమానాలుంటే జులాయి చూడండి!

రవీందర్ నారాయణ్ (అల్లు అర్జున్) వైజాగ్ కు చెందిన కుర్రాడు. తండ్రి
మాటల్ని లెక్క చేయడు. ఈజీ మనీపైనే అతని గురి. పదివేలిస్తే రెండు గంటల్లో
లక్ష చేసి చూపిస్తానంటాడు. బయటికొచ్చి వర్షంలో నిలుచునుండగా ఓ కారొస్తుంది.
లిఫ్టడుగుతాడు. అతనెక్కింది బ్యాంకులో దొంగతనానికి వెళ్తున్న ముఠా బండిని.
ఆ ముఠాకు నాయకుడు బిట్టూ (సోనూసూద్) ఆ విషయం అర్థమై తర్వాత పోలీసులకు
ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. బ్యాంకులో దొంగతనం జరుగుతుంది. తర్వాత పోలీసులు
బిట్టూను పట్టేసుకుంటారు. అక్కడి నుంచి మొదలవుతుంది విలన్ కి, హీరోకి మధ్య
ఫైట్. బిట్టూ తప్పించుకుంటాడు. హీరోను టార్గెట్ చేస్తాడు? అతను ఎలా
తప్పించుకున్నాడు? ఇంతకీ డబ్బేమైంది? విలన్ కథ ఎలా ముగిసిందన్నది మిగిలిన
కథ.
దేవిశ్రీ సంగీతం సినిమా జోష్ ను పెంచడానికి ఉపయోగపడింది. సినిమా చివరి 30 నిమిషాల్లో రాజేంద్రప్రసాద్ అదరగొట్టారు. ఐతే ఆయనకు మేకప్ బాగా ఎక్కువవడం వల్ల సహజత్వం దెబ్బతింది.
ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కొంచెం వీక్. సెకండాఫ్ మొదట్లో కథనం కొంచెం పక్కదారి పడుతుంది. సన్నివేశాలు కొంచెం స్లోగా నడుస్తాయి. మంచి పాటలన్నీ ఫస్టాఫ్ లోనే వస్తాయి. కానీ త్రివిక్రమ్ సరిపడా వినోదాన్నిచ్చాడు కాబట్టి జులాయికి బాక్సాఫీసులో ఢోకా లేదు.

నా రేటింగ్ 3.75/5
Comments
Post a Comment