Skip to main content

ఈ ప్రపంచం కళ్ళుతెరువక ముందే సంస్కృతీ ,సాంప్రదాయాలు,నాగరికతా ,నేర్చిన దేశం భారతదేశం .

ఈ ప్రపంచం కళ్ళుతెరువక ముందే సంస్కృతీ ,సాంప్రదాయాలు ,నాగరికతా ,నేర్చిన దేశం భారతదేశం .

 సరస్వతీ నదీ పరీవాహక ప్రదేశంలోను, రావిసింధు నదీ ప్రాంతాలలోను 1922 నుంచి ప్రారంభించి ఇంత వరకు దాదాపు 2,500 త్రవ్వకాలు జరిగాయి. 80 ఏళ్ల క్రితం వరకు ఎవరికీ తెలియని విశేషాలెన్నో ఇప్పుడు మన కు తెలుస్తున్నాయి. ఈ త్రవ్వకాలలో ప్రధానంగా సరస్వతీ నది ప్రవాహమార్గానికి ఇరు ప్రక్కల  బైటపడినవే అత్యధికం. సరస్వతీనది అదృశ్యమవడం ఒక విచిత్ర పరి స్థితిలో జరిగింది. పరిణామంగా ఆ ప్రాంతంలోని ప్రజలు ముఖ్యంగా నాగరికులు ఇరాన్‌, మెసపటోమియా వంటి అనేక సరిహద్దు భూభాగాలకు తమ జీవన భృతిని వెతు క్కుంటూ వెళ్లారు. క్రీ.పూ. 1900 ప్రాంతంలో అనేక వరదలు, కరువులు సంభవించడంతో వైదిక జనం ఇలా పశ్చి మానికి వలసలు పోయారని, వారిలో కొందరు వివిధ దిక్కులకు విస్తరించారని అంటే ఐరోపా భూభాగాల్లో కూడా విస్తరించారని స్పష్టమవుతోంది. ఆ విధంగా తద నంతర కాలపు వేయ్యి సంవత్సరాల వరకు అనేక రాజ వంశాలు, రాజులు ఆయా ప్రాంతాలలో తరచు కనిపిస్తూ, వినిపిస్తూ ఉండేవారని ఆ విధంగా పశ్చిమాన్నుంచి ఆర్యుల దండయాత్ర చేయుట అసత్యమని, కరువు కాటకాల వలన జీవనోపాధి కోసం సింధు సరస్వతీ తీరవాసులు పశ్చిమానికే వలసపోయారని స్పష్టమవుతోంది.

 ఈ నాగరికత క్రీ.పూ. 1900 ప్రాతంలో నశించిపోయిందన్నారు. ఆర్యుల దండయాత్ర క్రీ.పూ. 1500 ప్రాంతంలో నడుమ 400సం. రాల వ్యవధి ఉన్నది గదా. వారూహించినట్లు ఆర్యులు దండెత్తి వచ్చి సింధు నాగరి కతను ధ్వంసం చేసి ఉంటే ఈ 400 సం||ల కాలఖండంలో ఏమేమి ఇంకా జరిగి ఉంటుందో వారు తెలియ జేయలేదు. క్రీ.పూ. 1400 నుండి 1300 వరకు వైదికయుగం విస్తరించిందని, వేదాలు అప్పటికి రచిం చడం పూర్తయిందని, తదనంతరం ఆర్యులు దేశీయులైన ఉత్తరభారత ప్రజానీకంపై వైదిక నాగరికతను రుద్దారని ఆర్య దురాక్రమణవాదులు చెబుతున్నారు. వారి లెక్కల ప్రకారం రామాయణ, భారతాలు నిజంగా జరిగి ఉంటే అవి క్రీ.పూ. 1200 నుండి 1000 సం.ల వరకు జరిగిన కథలై ఉండాలి. ఆ తర్వాతనే వివిధ సామ్రాజ్యాల నిర్మా ణం, గౌతమబుద్ధుని జననం జరిగినట్లు చెప్పవలసి వస్తుంది. ఇదంతా కూడా మాక్స్‌ ముల్లర్‌ ప్రతిపాదించిన ఊహాజనిత చరిత్ర మాత్రమే. దానికి కారణం ఈ సృష్టి 4004సం.లో ప్రారంభమైందని ఆయన తన మత విశ్వా సంపైనే ఆధారపడి అల్లిన కట్టుకథ. ఇదంతా కూడా పురా తత్వశాస్త్ర ఆధారితమైన పరిశోధనలోగాని, వేద శాస్త్రీయ ప్రమాణాలతోగాని, సాంప్రదాయక విశ్వాసాలలోగానీ ముఖ్యంగా శాస్త్రీయపద్ధతులతో జరిపిన ఎట్టి విశ్లేషణలో తర్కానికిగానీ ఏమాత్రం నిలవలేని విశేషాలే. అయితే శాస్త్రీయ పరిశోధనను బట్టి భారత జాతీయ కాలక్రమ పరిణామాన్ని డా||దినేశ్‌ అగర్వాల్‌ ఈ విధంగా సూచి స్తున్నారు.
ఆధునిక చరిత్ర ప్రకారం వైదికయుగం కనీసంగా, క్రీ.పూ. 7000 నుండి 4000 వరకు విస్తరించింది. ఋగ్వేదయుగం 3750 బి.సి.లో అంతమవుతోంది. రామాయణ మహాభారత కాలాలు. క్రీ.పూ. 3000తో ముగుస్తున్నాయి. సరస్వతి సింధు నాగరికత 3000బి.సి. నుండి 2000 బి.సి. వరకు వికాసం చెందింది. సింధు సరస్వతీ నాగరికత 2000 నుండి 1900 నడుమ కాలంలో నశించి పోయింది. క్రీ.పూ. 2000 నుండి 1500 వరకు జన జీవితమంతా గందరగోళంలోనూ, వలస ల్లోను కొట్టుమిట్టా డింది. క్రీ.పూ. 1400 నుండి క్రీ.పూ. 250 వరకు ఒక క్రమబద్ధమైన హైందవ సంస్కృతీ వికాసం నిరంతరాయంగా కొనసాగుతూ వచ్చింది.
ఆర్యదండయాత్ర సిద్ధాంతకర్తలు పదేపదే ద్రావిడ సంస్కృతి గూర్చి తమ రచనల్లో ఉదహరిస్తూ వచ్చారు. దక్షిణభారతంలో ఈ ద్రావిడ సంస్కృతి వ్యాపించినది అని వారి సిద్ధాంతం. దక్షిణభారతం లోని అతి ప్రాచీనమై నది సంగమ సాహిత్యం. దాని ప్రకారం దక్షిణభారతదేశం లోని తమిళ జాతి పుట్టుక.
ఉత్తరభారతంలో కాక మరింత దక్షిణంగా అంటే ఇప్పుడు సముద్రగర్భంలో మునిగి ఉండిన 'కుమారి కుం డం' ద్వీపంనుంచి వచ్చింది. ఈ మధ్య సముద్రగర్భం నుంచి వెలువడిన 'పూంపుహార్‌' నగర జ్ఞాపకాలను అది గుర్తుచేస్తోంది. ఆ నగరాలు శిలప్పాధికారం మణిమేఖలై పురాణాలలో వర్ణించబడినది. అవి పూర్తిగా వెలువడితే మరెన్నో విశేషాలు మన దేశచరిత్రకు సంబంధించినవి మనకు వెల్లడి కావచ్చు. ద్రావిడ సంస్కృతి అనబడే దక్షిణభారత సంస్కృతి యొక్క గొప్పదనాన్నిగాని, విస్తృ తినిగాని, ప్రత్యేకతను గాని మనమెవ్వరం తిరస్క రించలేం. అయితే కొందరు అది భారతీయమైన సం స్కృతికన్నా విభిన్న మైనది అని చెప్పడం మాత్రం మనం అంగీకరించలేం. ప్రాచీన తమిళ సంస్కతి ఏ విధంగా చూచినా బెంగాలీ, గుజరాతీ సంస్కృతుల కన్నా వేరైనది, విభిన్నమైనది కానే కాదు.
ప్రాంతీయ సంస్కృతులన్నిటిలోను వాటి ప్రత్యేక విశేషాలు స్పష్టమవుతూనే వున్నా, అవన్నీ భారతీయమైన ఒకే మహావృక్షపు విభిన్నశాఖలు మాత్రమే. 'శిలప్పా ధికారం' ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే దానిలో వైదికమైన ఇంద్ర, శివ, విష్ణు, కృష్ణ, దుర్గ, లక్ష్మి వంటి అనేక దేవతా మూర్తుల విశేషాలు వర్ణింపబడి ఉన్నాయి. చెంగుట్టవాన్‌ చక్రవర్తి హిమాలయాల నుండి కణ్ణగీదేవి యుక్క శిలాప్రతిమను తీసుకుని వచ్చాడనీ, అతని పూర్వులు అచట తమ వంశ ప్రతీకలను చెక్కించారనీ చెప్పబడింది. అతడు అనేకమంది ఉత్తర భారతదేశపు చక్రవర్తులతో పోరాడాడని ఉంది. అయినా వారిది తమ కంటే విభిన్నమైన సంస్కృతి అని ఎక్కడా చెప్పబడలేదు. చారిత్రక వివరాల్లోకి వెళితే చోళ,చేర చక్రవర్తులు తాము శ్రీరాముని సూర్యవంశం నుండి, చంద్రవంశపురాజుల నుండి వచ్చిన రాజవంశాలవారిమని చెప్పుకున్నారు. అతి ప్రసిద్ధుడైన చోళమహాచక్రవర్తి కరికాళుడు వైదిక ధర్మాన్ని తమిళ సాహిత్యాన్ని కూడా పెంచి పోషించాడని తెలు స్తుంది. ప్రసిద్ధ పాండ్య చక్రవర్తి నెడుంజెరియన్‌ అనేక వైదిక యజ్ఞాలను చేశాడట. పల్లవ వంశపు రాజులు కాంచీ పురంను తమ రాజ ధానిగా చేసుకుని అచట సంస్కృత భా ష, సంస్కృత అధ్య యనమునకు ఒక విద్యా కేంద్రాన్ని స్థాపించారట. మ రొక పాండ్య మహా రాజు మహాభారత యుద్ధంలోని కురు పాండవ సైన్యాన్నం తటికీ భోజన వస తిని ఏర్పాటు చేశా డట. అంతేకాదు ఉత్తరం నుండి దక్షి ణానికి దిగి వచ్చిన అగస్త్యమహర్షికి దక్షిణ భారతంలో ఇవ్వబడిన గౌరవ ప్రపత్తులు అనిర్వచనీయములు.
దీనిని బట్టి వైదిక సంస్కృతి దక్షిణ భారతమంతటా విస్తరించి ఉన్నదని అదే హిందూత్వమన్న పేరున వ్యాప్తి చెందినదని, తమిళదేశం తనవంతుగా సంగీత, నాట్య, శిల్ప శాస్త్రాలలో భక్తి ఉద్యమాలలో ఉత్తర భారతమునకు ఎనలేని సహకారం చేసినదని తెలుసుంది.
అయితే ఆర్యులు దేవతలను ప్రార్థించగా వారు వచ్చి అనార్యుల కోటలను ధ్వంసం చేయుటలో సహక రించినట్లుగా కొందరు వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఆర్యులకు స్వయంగా అనేక కోటలు ఉన్నాయి. యుద్ధ రంగంలో ఆర్యుల గుర్రాలు పరుగెత్తిన వేగం వర్ణనను బట్టి సంచార జాతులకు చెందినవారు కాదు అని స్పష్టం గా తెలుస్తోంది. అసలు రథాలనేవి సంచార జాతులకు సంబంధించిన వాహనాలు కావు. ఋగ్వేద మంత్రాల్లో వర్ణించబడినది ముఖ్యంగా సమరా లలో దిగ్విజయం సాధించే వీరపురుషజాతి. ఐనా ఈ వేద మంత్రాలలో అనే కం పదేపదే చెప్పబడు తున్నా, అవన్నీ ఒక మనోహ రమైన కవితా స్వరూపంగానే కొనసాగినవ. ఈ సందర్భంలో ఋగ్వేదం లో దాదాపు సప్తసింధు ప్రాంతంపై పండ్రెండు సందర్భాలలో వర్ణలున్నాయి. వానిలో ఏ ఒక్కదాని లోను దండయాత్ర ప్రసక్తి కూడా కన్పించడం లేదు. సప్తసింధు ప్రాంతమే ఋగ్వేదభూమి. అక్కడకు ఆర్యులు ఆగంతకులుగా వచ్చారని సూచించే పదాలేమీ లేవు. అంతేకాదు. అక్కడ ఎత్తయిన గోడల మధ్య ఉండే నగరాలలో నివసించే దస్యులన బడేవారు దండెత్తి వచ్చారని చెప్పబడే ఆర్యుల కంటే అధికంగా ఆటవికులని ఏ విధంగానూ చెప్పడానికి వీలులేదు'' అంటారు.
ఆర్యులకు స్వతంత్రంగా కోటలుగాని, పటిష్టమైన రక్షక నగరాలుగాని లేని వారని చెప్పుటకు ఋగ్వేదంలో ఎక్కడా ఆధారం కన్పించడం లేదు. సింధు నాగరికత పతనానికి అచటకు వెలుపల నుండి వచ్చిన వారి దండ యాత్రలు కారణమని చెెప్ప టానికి ఆధారములు లేవు.
1819-1827 మధ్యకాలంలో ఆనాటి బొంబాయి ప్రెసిడెన్సీలో గవర్నర్‌| 1841లోవ్రాసిన 'హిస్టరీ ఆఫ్‌ ఇండియా' అనే గ్రంథంలో హిందువులకు భారతదేశంలో కన్నా వెలుపలనున్న ఏ ప్రాం తమూ పుట్టినిల్లని చెప్పడానికి మనుధర్మశాస్త్రంలొగాని, అంతకుపూర్వపు వేదాలలోగాని ఆధారాలు లేనే లేవు. పురాణాలలో కూడా హిమాలయ సానువులే దేవతలకు నిలయములని స్పష్టంగా చెప్పబడుతోంది . ఒక కేంద్రం నుండి వలసలు సంస్కృతీ ప్రసారములు వత్త పరిధిలో వలయాలుగా విస్తరిస్తాయని చెప్పడం అసంబద్ధమైనది..
- డా||కె.ఘనశ్యామల ప్రసాదరావు (ఆంధ్రప్రభ )  నుంచీ గ్రహించ బడినదిగా పాటకులు గుర్తించవలెను.

Comments

Popular posts from this blog

భక్త ప్రహ్లాద 1967 పాటల పుస్తకం

భక్త ప్రహ్లాద 1967 భక్త ప్రహ్లాద 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన  ప్రహ్లాదునిని  కథ ఆధారంగా వచ్చిన సినిమా. దీనికి మునుపు 1931, మరియు 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా  ఎస్.వి. రంగారావు ,  ప్రహ్లాదుడిగా రోజారమణి , ప్రహ్లాదుడి తల్లిగా  అంజలీ దేవి  నటించారు బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం మంచి పేరు తెచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు.

కమ్మ,రెడ్డి,కాపు ఒకే కులం

కమ్మ,వెలమ,రెడ్డి,కాపు,ఒకే కులం   మధ్య యుగములో గ్రామాధికారిగా వ్యవహరించే కాపును రెడ్డి అని గౌరవపూర్వకముగా సంబోధించేవారు. ప్రముఖ బ్రిటిష్ సామాజిక శాస్త్రజ్ఞుడు ఎడ్గార్ థర్ స్టన్ 'రెడ్డి' అను బిరుదు కలవారిని 'కాపు' కులంలో భాగంగా పేర్కొన్నాడు కాపులు రెడ్లు వేరువేరు కులాలు వారుకాదు.వారిద్దరూ ఒకేకులస్తులు.రెడ్లు ఇప్పటికీ తమకులం కాపు అని పేర్కొంటారు అని చేగొండి హరిరామ జోగయ్య సమాచార శాఖా మంత్రిగా ఉన్నరోజుల్లో అన్నారు."నిజాం రాజ్యంలో కులాలు తెగలు" అనే గ్రంధంలో(1920) సయ్యద్ సిరాజుల్ హసన్ కాపుల గురించి వివరంగా రాశారు:కాపు,కుంబి,రెడ్డి-ద్రావిడ జాతికి చెందిన వ్యవసాయదారుల కులం.ఆదిరెడ్డికి పుట్టిన ఏడుగురు కొడుకులలోంచి పుట్టిన కాపులు 10 ఉప కులాలుగా విడిపోయారు.1.పంచరెడ్లు(మోటాటి,గోదాటి,పాకనాటి,గిట్టాపు,గోనెగండ్లు) 2.యాయ 3.కమ్మ 4.పత్తి 5.పడకంటి 6.శాఖమారి 7.వక్లిగర్ లింగాయతు 8.రెడ్డి 9.పెంట 10.వెలమ.మోటాటి రెడ్లు మోటాటి కాపుల ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకుంటారు.చిట్టాపుకాపులు మాసం మద్యం ముట్టరు.గోడాటికాపుస్త్రీలు పైట కుడివైపుకు వేస్తారు.వారిలో వితంతువివాహాలున...

ఆదర్శ కుటుంబం లిరిక్స్

https://www.saavn.com/p/album/telugu/Aadarsa-Kutumbam-1969/JpW3TvCCtNI_ ఆదర్శ కుటుంబం