ఈ ప్రపంచం కళ్ళుతెరువక ముందే సంస్కృతీ ,సాంప్రదాయాలు ,నాగరికతా ,నేర్చిన దేశం భారతదేశం . సరస్వతీ నదీ పరీవాహక ప్రదేశంలోను, రావిసింధు నదీ ప్రాంతాలలోను 1922 నుంచి ప్రారంభించి ఇంత వరకు దాదాపు 2,500 త్రవ్వకాలు జరిగాయి. 80 ఏళ్ల క్రితం వరకు ఎవరికీ తెలియని విశేషాలెన్నో ఇప్పుడు మన కు తెలుస్తున్నాయి. ఈ త్రవ్వకాలలో ప్రధానంగా సరస్వతీ నది ప్రవాహమార్గానికి ఇరు ప్రక్కల బైటపడినవే అత్యధికం. సరస్వతీనది అదృశ్యమవడం ఒక విచిత్ర పరి స్థితిలో జరిగింది. పరిణామంగా ఆ ప్రాంతంలోని ప్రజలు ముఖ్యంగా నాగరికులు ఇరాన్, మెసపటోమియా వంటి అనేక సరిహద్దు భూభాగాలకు తమ జీవన భృతిని వెతు క్కుంటూ వెళ్లారు. క్రీ.పూ. 1900 ప్రాంతంలో అనేక వరదలు, కరువులు సంభవించడంతో వైదిక జనం ఇలా పశ్చి మానికి వలసలు పోయారని, వారిలో కొందరు వివిధ దిక్కులకు విస్తరించారని అంటే ఐరోపా భూభాగాల్లో కూడా విస్తరించారని స్పష్టమవుతోంది. ఆ విధంగా తద నంతర కాలపు వేయ్యి సంవత్సరాల వరకు అనేక రాజ వంశాలు, రాజులు ఆయా ప్రాంతాలలో తరచు కనిపిస్తూ, వినిపిస్తూ ఉండేవారని ఆ విధంగా పశ్చిమాన్నుంచి ఆర్యుల దండయాత్ర చేయుట అసత్యమని, కరువు కాటకాల వలన జీవనోపాధ...
తెలుగు సినిమా లిరిక్స్ అండ్ సాంగ్స్