Skip to main content

"అత్యున్నత ప్రమాణాలు గల విద్య అందరికీ ఎక్కడైనా "అందించే ఉద్దేశంతో స్థాపించబడిన ఈ సంస్థ :ఖాన్ అకాడమీ

ఖాన్ అకాడమి ఇది ఒక విజ్ఞాన భండాగారం .ఇక్కడ మనం గణితము, సైన్సు,ఆర్దిక శాస్త్రము మరియు అన్ని రకముల తరగతుల వారికి అవసరమైన 3,300 వీడియోలు కలవు .  ఈ  క్రింది లింక్ను  నొక్కండి
http://www.khanacademy.org/

ఖాన్ అకాడమీ


ఖాన్ అకాడమీ

Slogan "అన్ని వయస్సులవారికి నేర్చుకోవడం వేగవంతంచేయడం."
Commercial? కాదు
Type of site విద్యా విషయ సంగ్రహం
Registration కొన్నిటికి పేరు నమోదు చేసుకోవాలి
Available language(s) అమెరికన్ ఇంగ్లీషు మరియు ఇతర అనువాదాలు
Content license క్రియేటివ్ కామన్స్ (BY-NC-SA)
Owner సల్మాన్ ఖాన్
Created by సల్మాన్ ఖాన్, వ్యవస్థాపకుడు మరియు కార్యనిర్వాహక సంచాలకుడు
Launched సెప్టెంబర్ 2006
Revenue ఉచితం
ఖాన్ అకాడమీ ఒక లాభాపేక్ష లేని విద్యా సంస్థ. దీనిని 2006 లో యమ్ ఐ టి నుండి పట్టాపొందిన సల్మాన్ ఖాన్ అనే దక్షిణాసియా మూలాలు గల అమెరికన్ స్థాపించాడు.  "అత్యున్నత ప్రమాణాలు గల విద్య అందరికీ ఎక్కడైనా "అందించే ఉద్దేశంతో స్థాపించబడిన ఈ సంస్థ , 3,300పైగా సూక్ష్మ వీడియో ప్రసంగాలు యూ ట్యూబ్ ద్వారా గణితం, చరిత్ర, ఆరోగ్యం & వైద్యం, విత్త శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, అర్థ శాస్త్రం, కాస్మాలజీ మరియు కంప్యూటర్ సైన్స్ లాంటి వివిధ విద్యా విషయాలలో అందిస్తుంది.

Comments

Post a Comment

Popular posts from this blog

భక్త ప్రహ్లాద 1967 పాటల పుస్తకం

భక్త ప్రహ్లాద 1967 భక్త ప్రహ్లాద 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన  ప్రహ్లాదునిని  కథ ఆధారంగా వచ్చిన సినిమా. దీనికి మునుపు 1931, మరియు 1942 లో కూడా ఇదే పేరుతో తెలుగులో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా  ఎస్.వి. రంగారావు ,  ప్రహ్లాదుడిగా రోజారమణి , ప్రహ్లాదుడి తల్లిగా  అంజలీ దేవి  నటించారు బాల్యంలో ఎంతో ప్రహ్లాదుడిగా వయసుకి మించిన పరిణితి చూపి నటించింది రోజారమణి. ఆమెకీ చిత్రం మంచి పేరు తెచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ నారదునిగా నటించారు. హరనాధ్ శ్రీ మహావిష్ణువుగా నటించారు. తెరపై ఈ చిత్రాన్ని పురాణంగా చెప్పడం కంటే, నాటకీయత కు ప్రాధాన్యతనూ దర్శక నిర్మాతలు ప్రయత్నించేరని అందుకే సముద్రాల కంటే తనకు ప్రాధాన్యత నిచ్చేరని ఈ చిత్ర రచయిత డి.వి.నరసరాజు గారు పేర్కొనే వారు.

కమ్మ,రెడ్డి,కాపు ఒకే కులం

కమ్మ,వెలమ,రెడ్డి,కాపు,ఒకే కులం   మధ్య యుగములో గ్రామాధికారిగా వ్యవహరించే కాపును రెడ్డి అని గౌరవపూర్వకముగా సంబోధించేవారు. ప్రముఖ బ్రిటిష్ సామాజిక శాస్త్రజ్ఞుడు ఎడ్గార్ థర్ స్టన్ 'రెడ్డి' అను బిరుదు కలవారిని 'కాపు' కులంలో భాగంగా పేర్కొన్నాడు కాపులు రెడ్లు వేరువేరు కులాలు వారుకాదు.వారిద్దరూ ఒకేకులస్తులు.రెడ్లు ఇప్పటికీ తమకులం కాపు అని పేర్కొంటారు అని చేగొండి హరిరామ జోగయ్య సమాచార శాఖా మంత్రిగా ఉన్నరోజుల్లో అన్నారు."నిజాం రాజ్యంలో కులాలు తెగలు" అనే గ్రంధంలో(1920) సయ్యద్ సిరాజుల్ హసన్ కాపుల గురించి వివరంగా రాశారు:కాపు,కుంబి,రెడ్డి-ద్రావిడ జాతికి చెందిన వ్యవసాయదారుల కులం.ఆదిరెడ్డికి పుట్టిన ఏడుగురు కొడుకులలోంచి పుట్టిన కాపులు 10 ఉప కులాలుగా విడిపోయారు.1.పంచరెడ్లు(మోటాటి,గోదాటి,పాకనాటి,గిట్టాపు,గోనెగండ్లు) 2.యాయ 3.కమ్మ 4.పత్తి 5.పడకంటి 6.శాఖమారి 7.వక్లిగర్ లింగాయతు 8.రెడ్డి 9.పెంట 10.వెలమ.మోటాటి రెడ్లు మోటాటి కాపుల ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకుంటారు.చిట్టాపుకాపులు మాసం మద్యం ముట్టరు.గోడాటికాపుస్త్రీలు పైట కుడివైపుకు వేస్తారు.వారిలో వితంతువివాహాలున...

శ్రీ కృష్ణ పాండవీయం

  శ్రీ కృష్ణ పాండవీయం ఈ చిత్రంతో ఎన్.టి. రామారావు పేరు దర్శకునిగా మొదిటి సారి వెండితెర మీద కనిపించింది. గతంలో సీతారామ కల్యాణం, గులేబకావలి కథ సినిమాలకు దర్శకత్వం వహించినా, దర్శకుని పేరు క్రెడిట్స్ లో వేయలేదు.  ఎన్.టి.రామారావు శ్రీకృష్ణ, దుర్యోధన పాత్రలను అపూర్వంగా పోషించారు. కాదు ఆ పాత్రలలో ఇమిడి పోయారు. కె.ఆర్.విజయ రుక్మిణి పాత్రలో ముగ్ధమనోహరంగా ఉంటుంది. గతంలో సి.ఎస్.ఆర్., లింగమూర్తి శకుని పాత్రను పోషించారు. వారి పాత్రధారణకు భిన్నంగా ధూళిపాల ఈ చిత్రంలో శకుని పాత్రను పోషించారు. శకుని పాత్ర ధారణకు ధూళిపాల కొత్త ఒరవడిని సృష్టించారు. జరాసంధునిగా ముక్కామల, శిశుపాలునిగా రాజనాల, రుక్మిగా కైకాల సత్యనారాయణ పాత్రలలో జీవించారు. మిగిలిన నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు. భారత కథలో భాగవత కథ రుక్మిణీ కల్యాణాన్ని జోడించారు. ఐతే అది అతికినట్టు కాకుండా సహజంగా ఇమిడి పోయింది. కంటిన్యూటి ఎక్కడా చెడలేదు. మయసభ సెట్టింగ్ చాలా భాగుంటుంది. భారీ సెట్టింగ్.ఆ సెట్టింగ్ గురించి ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునే వారట. ఆ సెట్ విజయ వాహిని స్టూడియోలో వేసేరట. ఆ ఫ్లోర్ లో ఎవ్వరినీ అనుమతించే...